/rtv/media/media_files/2025/02/28/9U4Zac4a2N4mOYgrjgAo.jpg)
Kajal, Tamanna
పుదుచ్చేరిలో క్రిప్టో కరెన్సీ పేరుతో హారీ మోసం జరిగింది. ఇందులో డబ్బులు పెట్టుబడి పెడితే బోలెడు లాభాలు సంపాదించవచ్చని చెప్పి 10 మంది నుంచి దాదాపు రూ.2.40 కోట్లు వసూలు చేశారు. 2022లో ఇది జరిగింది. దీనికి సంబంధించి కొయంబత్తూరులో ఒక ఆఫీస్ కూడా ప్రారంభించారు. దీని ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరోయిన్లు తమన్నా, కాజల్ అగర్వాల్ ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత మహాబలిపురంలో ఓ స్టార్ హోటల్ లో ఆ దొంగ కంపెనీ జరిపిన ఓ కార్యక్రమానికి కూడా కాజల్ హాజరయ్యారు. ఆ తర్వాత ముంబైలో పార్టీ నిర్వహించి వేలాది మంది నుంచి డబ్బు సేకరించారు.
Also Read: Blinkit: బ్లింకిట్ లో పది నిమిషాల్లో యాపిల్ ఉత్పత్తులు
ప్రారంభ కార్యక్రమంలో తమన్నా, కాజల్..
అయితే ఇప్పుడు తాజాగా సదరు కంపెనీ మీద పుదుచ్చేరికి సంబంధించిన అశోకన్ అనే రిటైర్డ్ ఉద్యోగి కంప్లైంట్ చేశారు. చాలా డబ్బులు వస్తాయని ఆశ చూపి తమ దగ్గర డబ్బులు తీసుకున్నారని...కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన సమాచారమేమీ ఇవ్వలేదని..అసలు కొంత కాలంగా సంస్థకు సంబంధించిన వాళ్ళెవరూ రెస్పాండ్ అవడం లేదు. కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ ఆధారంగా పుదుచ్చేరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో తమన్నా, కాజల్ లో కంపెనీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి నితీష్ జెయిన్, అరవింద్ కుమార్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా తమన్నా, కాజల్ అగర్వాల్ లను విచారించాలని పోలీసులు నిర్ణయించారు.
Also Read: Israel: ఇజ్రాయెల్ లో జనంపైకి దూసుకెళ్ళిన కారు..ఉగ్రదాడి అనుమానం