నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C 59

శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ -C 59 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. అనుకున్న సమయానికి.. 4.04 నిమిషాలకు ప్రయోగం జరిగింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రూపొందించిన ప్రోబా ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ C-59 అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది.

author-image
By srinivas
New Update
rrerer

PSLV: శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ - c59 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. అనుకున్న సమయానికి.. 4.04 నిమిషాలకు ప్రయోగం జరిగింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రూపొందించిన ప్రోబా ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ c-59 అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించేందుకు, సూర్యుని బాహ్య వలయం కరోనాని అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం నిర్వహించారు. 

Also read: భారత మొదటి ప్రైవేట్ శాటిలైట్ ఆపరేటర్‌గా హైదరాబాద్‌ కంపెనీ..

సూర్యునిపై ప్రత్యేక పరిశోధనలు..

ఇక ఈ ఉపగ్రహంలో 310 కేజీల బరువైన కరోనా గ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్, 240 కేజీల ఓకల్టర్ స్పేస్ క్రాఫ్ట్‌లను నింగిలోకి పంపించారు. ఈ రాకెట్‌ను సుమారు 550 కేజీల బరువుతో ఇన్ ఆర్బిట్ డెమానిస్ట్రేషన్ లక్ష్యంగా ప్రయోగించారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో కలిసి ఇస్రో అధికారులు ప్రయోగం చేపట్టారు. రాకెట్ ప్రయోగ కౌంట్‌డౌన్ ప్రక్రియ సజావుగా సాగుతోందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌ చెప్పారు. సూర్యునిపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టడమే ఈ ఉపగ్రహ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. PSLV C- 60 రాకెట్‌ను కూడా ఈ నెలలోనే ప్రయోగిస్తామని ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు. చంద్రయాన్-4 రాకెట్ ప్రయోగం కోసం సన్నాహాలు జరుగుతున్నాయని, గగన్ యాన్ రాకెట్ ప్రయోగ ఏర్పాట్లు ఈ నెలలో ఇస్రో హెడ్‌క్వార్టర్స్‌లో మొదలవుతాయని తెలిపారు. 

Also Read: పుష్ప అంతా ఫేక్.. నేనూ ఎర్రచందనం వ్యాపారినే: రాకేష్ రెడ్డి

Also Read: రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. ఇక నుంచి ఆ బాధపడనవసరం లేదు!

Also Read: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఇష్యూ.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు!

Advertisment
తాజా కథనాలు