PM Modi: మోదీ కీలక నిర్ణయం.. స్థానిక భాషల్లో ఇకపై మెడిసిన్ ప్రస్తుతం వైద్య విద్యను అభ్యసించాలంటే కేవలం ఇంగ్లీషు భాషలో మాత్రమే చదవాలి. కానీ ఇకపై స్థానిక భాషల్లో మెడిసిన్ చదివేందుకు అవకాశం కల్పిస్తామని ప్రధాని మోదీ ఇటీవల బిహార్‌లో జరిగిన బహిరంగ సభలో తెలిపారు. By Kusuma 14 Nov 2024 in నేషనల్ జాబ్స్ New Update షేర్ చేయండి వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు ప్రధాని మోదీ గుడ్ న్యూస్ తెలిపారు. ఇప్పటి వరకు మెడిసిన్ విద్య కేవలం ఇంగ్లీష్‌లోనే అభ్యసించగలరు. కానీ ఇకపై స్థానిక భాషల్లో కూడా వైద్య విద్యను అభ్యసించే విధంగా అవకాశం కల్పిస్తామని ప్రధాని మోదీ ఇటీవల బీహార్‌లోని దర్బంగాలో జరిగిన ఓ సభలో తెలిపారు. వచ్చే రోజుల్లో మెడిసిన్‌లో 75 వేల వరకు సీట్లను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఇది కూడా చూడండి: ఉత్కంఠంగా సాగిన మూడో టీ20..భారత్ విజయం హిందీ భాషలో వైద్య పాఠ్య పుస్తకాలు.. గతంలో కూడా ప్రధాని మోదీ ఒకసారి ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వైద్య పాఠ్య పుస్తకాలను హిందీ భాషలో విడుదల చేసింది. మెడిసిన్ విద్యను హిందీలో ప్రవేశపెట్టేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది కూడా చూడండి: ఈరోజే మనకు బాలల దినోత్సవం..ఏఏ దేశాల్లో ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా? తమిళంలో వైద్య విద్యను అభ్యసించే విధానం తీసుకురావాలని తమిళనాడు ప్రభుత్వం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. ఇంగ్లీషు భాష కంటే స్థానిక భాషలో విద్యను అభ్యసించడం వల్ల అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని భావిస్తున్నారు. జపనీస్ భాషలోనే జపాన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. స్థానిక భాషల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న జపాన్ అన్ని రంగాల్లో కూడా దూసుకెళ్తుంది. ఇది కూడా చూడండి: Booker Prize: బుకర్‌ప్రైజ్ విజేతగా మొదటిసారి ఓ మహిళ ఇదిలా ఉండగా స్థానిక భాషలో వైద్య విద్యను ప్రవేశపెడితే ఇతర రాష్ట్రాల్లో ఉన్న కాలేజీలకు ఇబ్బంది అవుతుందని అంటున్నారు. అయితే స్థానిక భాషలను కేవలం మెడిసిన్‌లోనే కాకుండా ఐఐటీ, ఐఐఎంలో కూడా ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తోంది. వచ్చే రెండు నుంచి మూడేళ్లలో స్థానిక భాషల్లో ఇవన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. మరి స్థానిక భాషల్లో వైద్య విద్య రావాలంటే ఎన్నేళ్ల సమయం పడుతుందో చూడాలి. ఇది కూడా చూడండి: కంగువ ట్విట్టర్ రివ్యూ.. సూర్య బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టినట్లేనా! #modi #aiims #mbbs #medical-education మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి