USA: అమెరికా అధ్యక్షురాలిగా కమలా హారిస్?

అమెరికా అధ్యక్షురాలిగా కమలా హారిస్‌ను నియమించనున్నారు. అదేంటీ మొన్న ఎన్నికల్లో ట్రంప్ కదా గెలిచాడు..మరి కమలా ఎలా అధ్యక్షురాలు అనుకుంటున్నారా...అదే ట్విస్ట్. అదేంటో తెలియాలంటే..కింది ఆర్టికల్ చదివేండి. 

author-image
By Manogna alamuru
New Update
Kamala Harris: టాక్‌ ఆఫ్ ది వరల్డ్‌గా కమలా హ్యారిస్‌.. మరో చరిత్ర సృష్టించనున్న ప్రవాస భారతీయురాలు!

Kamala Harris: 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు అధ్యక్ష యోగం అయితే ఉన్నట్టు ఉంది. గెలిచింది ట్రంప్ అయినా ఇపుడు అధ్యక్షురాలు అయ్యేది మాత్రం కమలా హారిసే అంటున్నారు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా..  కమలా హారిస్‌కు అలా రాసి పెట్టి ఉంది మరి. ట్రం అధ్యక్షుడగా ఎన్నికైనా...తను పదవిలోకి రావడానికి  ఇంకా రెండు నెలలు టైమ్ ఉంది. ఈ లోపు జో బైడెన్‌ను  పదవిలో నుంచి తీసేసి కమల హారిస్‌ను అధ్యక్షురాలిగా చేయాలని డిమాండ్ మొదలైంది. ప్రస్తుతం కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. డొనాల్డ్‌ ట్రంప్  దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేవరకు కమలా హారిస్‌కు పదవి అప్పగించాలని ఆమె మాజీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌ జమాల్‌ సిమన్స్‌ సూచించారు. ప్ర‌త్యేకించి డెమొక్రాట్ల నుంచినే ఆమెకు అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించాల‌నే డిమాండ్ వ‌స్తోంది. 

Also Read: మీ తల్లిని చంపిన విషయం మర్చిపోయారా..ఖర్గేపై యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు

ఇన్నాళ్ళు బైడెన్ సమర్ధంతంగానే పరిపాలించినా...గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. అన్నీ మర్చిపోతున్నారు. ఇపపుడు ఇంకో రెండు నెలలే పరిపానా సమయం ఉన్నప్పటికీ...ఈ టైమ్‌లో అమెరికాకు అవి కూడా క్రూషియల్ అని భావిస్తున్నారు. అందుకే ఆ బాధ్యతలను కమలా హారిస్‌కు అప్పగించాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే..అమెరికా మొట్టమొది మహిళా అధ్యక్షురాలగా కమలా హారిస్ చరిత్ర సృష్టిస్తారు. 

Also Read: Cricket: పాకిస్తాన్ ఆటగాళ్ళకు భారత్ నో వీసా..

ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలాహారిస్‌ పోటీ చేసి ఓడిపోయారు.  కీలకమైన స్వింగ్‌ రాష్ట్రాలు అన్నింటిలో ట్రంప్ గెలిచి...అధ్యక్ష పీఠాన్ని వశం చేసుకున్నారు. మొత్తం ట్రంప్‌ 312 ఎలక్టోరల్‌ ఓట్లతో విజయం సాధించగా, హారిస్‌ 226 ఎలక్టోరల్‌ ఓట్లను సాధించారు. ఓటమి తర్వాత కమలా హారిస్ మాట్లాడుతూ.. ప్రజలందరి స్వేచ్ఛ, న్యాయం, అవకాశాలు, గౌరవం కోసం పోరాటం కొనసాగిస్తానన్నారు. ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన, సమాన న్యాయం కోసం శ్రమిస్తూనే ఉంటానన్నారు. ఈసారి గెలవకోయినప్పటికీ తన ప్రయత్నాలను కొనసాగించడం మానేయని చెప్పుకొచ్చారు. 

Also Read: AP: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా

Also Read: AP: సజ్జల భార్గవ రెడ్డిపై లుక్‌ అవుట్ నోటీసులు

Advertisment
Advertisment
తాజా కథనాలు