Rameswaram: రోజురోజుకి మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోతుడండంతో పాటు వారిని చాటుమాటుగా చూసే వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. మొన్నటికి మొన్న మహిళా టీచర్ల బాత్రూంలో, నిన్నటికి నిన్న స్కానింగ్ సెంటర్లో సీక్రెట్ కెమెరాలు దొరకగా.. తాజాగా ఓ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటనే రిపీట్ అయింది. రామేశ్వరంలోని ఆలయ ప్రాంగణంలో మహిళలు బట్టలు మార్చుకునే గదిలో రహస్య కెమెరా గుర్తించిందో మహిళ. Also Read: Ap Rains: ఏపీపై అల్పపీడీన ప్రభావం.. వాతావరణ శాఖ అలర్ట్! ఈక్రమంలోనే ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. తమిళనాడులోని రామేశ్వరం ఆలయం గురించి అందరికీ తెలిసిందే. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ఓ దారుణం వెలుగు చూసింది. పుదుకోట్టైకి చెందిన ఓ మహిళ తన కుటుంబంతో కలిసి రామేశ్వరాలయ సందర్శనకు వచ్చారు. ఈక్రమంలోనే సోమవారం ఉదయం గుడి వద్ద ఉన్న అగ్ని తీర్థం వద్దకు వచ్చారు. అక్కడ పుణ్యస్నానాలు చేశారు. Also Read: తిరుపతిలో అపచారం..అన్నమయ్య విగ్రహానికి శాంటక్లాస్ టోపీ పెట్టిన దుండగులు అయితే పురుషులు అంతా తీరంలోనే బట్టలు మార్చుకోగా.. మహిళ మాత్రం ఓ ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసిన బట్టలు మార్చుకునే గదిలోకి వెళ్లింది. తడిబట్టలతో వెళ్లిన ఆ మహిళ పొడి బట్టలు పెట్టేందుకు హ్యాంగర్ కోసం వెతికింది. ఈక్రమంలోనే గదంతా పరిశీలించిన ఆమెకు.. అక్కడ ఓ చోట రహస్య కెమెరా కనిపించింది. దీంతో షాక్ అయిన మహిళ తన బట్టలు తీసుకుని వెంటనే కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లింది. జరిగిన విషయం గురించి కుటుంబ సభ్యులతో పాటు అక్కడి ఆలయ సిబ్బందికి తెలియజేసింది. Also Read: ఆర్జీ కార్ హత్యాచార కేసు ఫోరెన్సిక్ రిపోర్టు...ఆ సమయంలో పెనుగులాటే జరగలేదట! ఆపై స్థానికంగా ఉన్న పోలీసులను ఆశ్రయించింది. మహిళలు బట్టలు మార్చుకునే గదిలో ఉన్న రహస్య కెమెరాల గురించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి చూశారు. ఈ క్రమంలోనే స్పై కెమెరాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని.. వాటిని పెట్టిన నిందితులెవరో దర్యాప్తు చేశారు. ముఖ్యంగా ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసిన ఈ గది నిర్వాహకుడు రాజేష్‌ను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్‌లో విచారించారు. Also Read: Zelensky: 3000 మందికి పైగా ఉత్తర కొరియా సైనికులు చనిపోయి ఉండొచ్చు! అతడు తనతో పాటు టీ స్టాల్‌లో పనిచేసే మీరా మొయిద్దీన్ అనే వ్యక్తి కూడా ఆ దృశ్యాలు చూస్తున్నట్లు చెప్పాడు. దీంతో అతడిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వీరిద్దర్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.మరోవైపు ఆలయ అధికారులు.. ఈ ఘటనపై స్పందించారు. ఆలయంలో ఇలాంటి చర్యలు జరగడం చాలా బాధగా అనిపించిందని చెప్పారు. అంతేకాకుండా ముందు ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.