Viral: ఏం సెటప్ చేశార్రా.. హోటళ్లో పెళ్లాలతో ఖైదీల సరసాలు..బిగ్ ట్విస్ట్ ఏంటంటే?

జైపూర్‌లో ఒక విచిత్రమైన సంఘటన వెలుగు చూసింది. జైలులో శిక్ష అనుభవిస్తున్న కొందరు ఖైదీలు, వైద్య పరీక్షల పేరుతో బయటకు వచ్చి, ఏకంగా హోటళ్లలో తమ భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌తో గడిపినట్లు వెలుగులోకి వచ్చింది.

New Update
Jaipur jail break

Viral: జైలంటే చిప్పకూడు తినాల్సిందేనని మన అందరికీ తెలుసు కానీ అక్కడికి వెళ్తే ఎంచక్కా హోటల్ బుక్ చేసుకుని గర్ల్ ఫ్రెండ్ తో మరీ ఎంజాయ్ చేయవచ్చునని మీకు తెలుసా..అరే ఇదేదో బాగుందే... నిజంగా అలా ఉంటుందా..  అయితే  మీరు జైపూర్ సెంట్రల్ జైలు గురించి తెలుసుకోవాల్సిందే.  వివరాల్లోకి వెళ్తే జైపూర్ సెంట్రల్ జైల్లో ఉంటున్న ఐదుగురు ఖైదీలు ఓ రోజంతా తమ గర్ల్ ఫ్రెండ్, భార్యలతో కలిసి తెగ ఎంజాయ్ చేశారు. అది కూడా హోటల్ లో. ఇది కాస్త వెలుగులోకి రావడంతో మొత్తం 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఇందులో నలుగురు ఖైదీలు, నలుగురు వారి రిలేటివ్స్, ఐదుగురు పోలీసులున్నారు. విచారణలో పోలీసులకే లంచం ఇచ్చి మరి ఖైదీలు ఈ ప్లాన్ వేసినట్లుగా తేలింది. 

Also Read: BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)

వైద్య పరీక్షల కోసమని వెళ్లి

రఫీక్ బక్రి, భన్వర్ లాల్, అంకిత్ బన్సాల్, కరణ్ గుప్తా అనే ఖైదీలను జైపూర్ లోని SMS ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసమని పోలీసులు బయటకు తీసుకువెళ్లారు.  అయితే రోజంతా లీజర్ ఉండేలా పోలీసులకు రూ. 25 వేలు  లంచం ఇచ్చి సెటిల్ మెంట్ చేసుకున్నారు. దీంతో ఐదు మందిలో ఒకరు మాత్రమే ఆరోజు హాస్పిటల్ లో చెకప్ కు వెళ్లినట్లు జైలు అధికారులు తెలిపారు.శనివారం (మే 24) సాయంత్రం 5.30 గంటల వరకు కూడా నలుగురు రాకపోవడం అనుమానాలకు దారితీసింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

Also Read: Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

రఫీక్ తన భార్యను, భన్వర్ లాల్ తన ఎక్స్-గర్ల్ ఫ్రెండ్ ను జలుపుర హోటల్ మీట్ అయ్యారు.  ఆ డే అంతా హోటల్ లో గడిపినట్లుగా అధికారులు గుర్తించారు.  ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే..  రఫీక్ భార్య నార్కోటిక్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలింది. డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ కావటంతో అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ తేజశ్విని గౌతమ్ వెల్లడించారు.  ఇక అంకిత్, కరణ్ అనే ఇద్దరు ఖైదీలు ఎయిర్ పోర్ట్ కు దగ్గర్లోని  ఓ హోటల్ లో  పోహా తీసుకున్నట్లు సీసీటీవీలో రికార్డు అయింది. వీళ్లిద్దరికీ ఆ హోటల్ రూమ్ బుక్ చేసింది అంకిత్ గర్ల్ ఫ్రెండ్ కావడం విశేషం. అయితే ఖైదీలకు ఔటింగ్ ఏర్పాటు చేసింది జైలులో ఉన్న ఓ  సీనియర్ అధికారినే అని పోలీసులు అనుమానిస్తున్నారు.  ఏప్రిల్ నెలలో మొత్తం 200 ఫోన్ కాల్స్ జైలు అధికారి మాట్లాడినట్లుగా గుర్తించారు. 

Also Read: BIG BREAKING: సంచలన అప్‌డేట్‌.. పుతిన్‌ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్‌ బాంబు దాడి !

Also Read: SRH VS KKR: హ్యాట్రిక్ విజయం..కేకేఆర్ ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్

Advertisment
Advertisment
తాజా కథనాలు