PM Modi: ఈద్ సందడి.. ముస్లింలకు ప్రధాని మోదీ స్పెషల్ విషెస్

రంజాన్ సందర్భంగా ప్రధాని మోదీ ముస్లింలకు ఎక్స్‌లో ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. '' ఈ పండుగ మన సమాజంలో ఆశ, సామరస్యం, దయ గుణాల స్పూర్తిని పెంపొందిచాలి. మీరు చేసే అన్ని ప్రయత్నాల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈద్ ముబారక్'' అంటూ రాసుకొచ్చారు.

New Update
PM Modi

PM Modi

సోమవారం ముస్లింలు ఈద్‌ వేడులు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. దీంతో అన్నీ మసీదుల్లో సందడి వాతవరణం నెలకొంది. ముస్లింలందరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ముస్లింలకు ఎక్స్‌లో ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. '' ఈ పండుగ మన సమాజంలో ఆశ, సామరస్యం, దయ గుణాల స్పూర్తిని పెంపొందిచాలి. మీరు చేసే అన్ని ప్రయత్నాల్లో  విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈద్ ముబారక్'' అంటూ రాసుకొచ్చారు. 

అలాగే ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా రాష్ట్ర ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగల వేళ అందరూ సమాజంలో సద్భావన, సామాజిక సామరస్యాన్ని బలోపేతం చేసేలా ప్రతిజ్ఞ చేయాలన్నారు. ఇదిలాఉండగా.. ఆదివారం సాయంత్రం ఢిల్లీతో పాటు వివిధ ప్రాంతంలో ఆకాశంలో ఈద్‌ ఉల్ ఫితర్ చంద్రుడు కనపించాడు. దీంతో పవిత్ర రంజాన్ మాసం ముగియడంతో దేశవ్యాప్తంగా సోమవారం ముస్లిం ప్రజలు ఈద్‌ జరుపుకుంటున్నారు. 

ramadan | pm modi | telugu-news | rtv-news | national

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు