/rtv/media/media_files/2025/03/25/oCWGhckAfbnWDTeDZ7jP.jpg)
pm kisan yojana 2025
PM Kisan Yojana 2025:కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(Kisan Samman Nidhi Yojana) 20వ విడత విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం 2019లో ప్రారంభించిన విషయం తెలిసిందే. దీని కింద చిన్న, మధ్యతరహా రైతులకు ప్రతి సంవత్సరం రూ. 6 వేలు సహాయం అందిస్తోంది. రైతులకు తదుపరి విడత త్వరలో అందుతుందని కేంద్ర చెపట్టిన ఈ పథకం లక్షలాది మంది రైతులకు ఉపశమనం లభిస్తుంది. వారి ఖాతాలో నేరుగా రూ. 2 వేలు జమ చేయనున్నారు. ఈ సారి 9.3 కోట్ల మంది రైతులకు ఈ పతకం వస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Also Read: అకౌంట్లోకి రూ.2వేలు.. పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి?
నేరుగా రైతుల ఖాతాల్లో...
ఈ విడత వచ్చే నెల ఆగస్ట్ 2 శనివారం విడుదల చేయనున్నారు. ఈ పథకంపై ప్రధాని మోదీ యూపీలోని వారణాసి నుంచి రైతుల బ్యాంకు ఖాతాలకు పంపనున్నారు. ఈ డబ్బులను 3 భాగాలుగా చేశారు. ప్రతి నాలుగు నెలలకు 2 వేలచొప్పున రైతుల ఖాతాలలో వేశారు. అయితే ఈ ప్రక్రియ 20వ విడతలో ఉంది. ఈ డబ్బును డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా రైతుల ఆధార్‌తో అనుసంధానించబడిన బ్యాంకు ఖాతాలకు నేరుగా పంపుతారు. ఈ పథకానికి సంబంధించి రైతులు సమాచారాన్ని తనిఖీ చేసుకోవచ్చు. ఈ పథకాన్ని పొందే రైతులు https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఈ వాయిదా డబ్బులు బకాయిలు చెల్లించిన రైతులకు మాత్రమే లభిస్తుంది. e-KYC పూర్తి చేయటం తోపాటు వారి భూమి రికార్డులు చూపాలి. అంతేకాకుండా e-KYC పూర్తి చేయకపోతే పథకంలో వచ్చే డబ్బులు ఆగిపోతుందని అధికారులు చెబుతున్నారు.
Also Read:రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి రూ.2 వేలు.. పీఎం కిసాన్ పైసలు పడేది ఎప్పుడంటే?
అయితే ఆగస్టు 2న ఈ విడత విడుదల చేసి రైతుల ఖాతాల్లోకి వచ్చే డబ్బుతోపాటు వారి మొబైల్‌కు SMS హెచ్చరిక కూడా వస్తుంది. ఈ పథకం రైతులకు వ్యవసాయంతో పాటు విత్తనాలు, ఎరువులు కొనడానికి రైతులకు మద్దతుగా ఉంటుంది. pmkisan.gov.inలోకి వెళ్లి హోమ్ పేజీలో లబ్ధిదారు స్థితి, రైతు స్థితి ఎంపికను కనుగొంటారు. ఆధార్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయాలి. తర్వాత డేటా పొంది బటన్ నొక్కాలి. స్క్రీన్ పై ఇన్‌స్టాల్‌మెంట్ గురించి పూర్తి సమాచారాన్ని తీసుకోవాలి. ఈ జాబితాలో మీ పేరు ఉంటే మీ ఖాతాలోకి రూ. 2,000 ఖచ్చితంగా వస్తుంది. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వ రైతులకు ఆర్థిక బలాన్ని అందించి.. వ్యవసాయానికి సంబంధించిన ఖర్చులకు సహాయం చేస్తుంది. ఈ పథకానికి డబ్బు అందకపోతే దాని గురించి ఫిర్యాదు చేయాలి. ఈ పథకానికి సంబంధించి హెల్ప్ లైన్ నంబర్ 011-23381092 కు కాల్ చేసి మీ సమస్యను చెప్పాలి. దీనితో పాటు [email protected] కు ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు.