Air India Flight Crash : వైద్య కళాశాల హాస్టల్‌ భవనంపై కూలిన విమానం: మృతుల్లో 20 మంది డాక్టర్లు

అహ్మదాబాద్‌లో కూలిన విమానం స్థానికంగా ఉన్న  బీజే ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్‌ భవనంపై పడింది... ఈ ప్రమాదంలో హాస్టల్‌లోని 20 మంది డాక్టర్లు మృతి చెందినట్లు సమాచారం.. భోజనం సమయం కావడంతో హాస్టల్‌లోనే చాలా మంది పీజీ వైద్య విద్యార్థులు ఉన్నారు.

New Update
Air India Flight Crash

Air India Flight Crash

 Air India Flight Crash :  అహ్మదాబాద్‌లో కూలిన విమానం స్థానికంగా ఉన్న  బీజే ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్‌ భవనంపై పడింది... ఈ ప్రమాదంలో హాస్టల్‌లోని 20 మంది డాక్టర్లు మృతి చెందినట్లు సమాచారం.. భోజనం సమయం కావడంతో హాస్టల్‌లోనే చాలా మంది పీజీ వైద్య విద్యార్థులు ఉన్నారు. వారంతా మెస్‌లో భోజనాలు చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో చాలామంది వైద్య విద్యార్థులు మృతిచెందటంతో పాటు పలువురు గాయపడినట్లు సమాచారం.


కాగా  అంతకుముందు విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు వచ్చింది.  తిరిగి మధ్యాహ్నం 1.38 సమయంలో టేకాఫ్‌ అయిన తర్వాత కేవలం ఐదు నిమిషాలకే మధ్యాహ్నం 1.43 గంటలకు కూలింది. కాగా  విమానం కూలిపోయేముందు ఏటీసీకి ఫైలట్లు ఎమర్జెన్సీ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అక్కడి నుంచి స్పందన రాకముందే విమానం కూలిపోయింది. ఈ విమానంలో మాజీ సీఎం రూపానీ కూడా ఉన్నారు. ఆయన తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 40 మృతదేహాలు అహ్మదాబాద్‌ అస్పత్రికి చేరాయి. విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్‌ దేశస్థులు. ఏడుగురు పోర్చుగీస్‌ దేశస్థులు, ఒకరు కెనడియన్‌ ఉన్నట్లు సమచారం.

కాగా ప్రమాదం జరిగిన వెంటనే అమితషాను అహ్మదాబాద్‌ వెళ్లాల్సిందిగా ప్రధాని మోడీ ఆదేశించారు.  విమానంలో 242 మంది ప్రయాణికులు ఉండగా వారిలో అందులో 11 మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది. పైలట్లు సుమిత్‌ సబర్వాల్‌, క్లేవ్‌ కుందర్‌ ఉన్నారని ఎయిర్‌ ఇండియా తెలిపింది.   

Advertisment
తాజా కథనాలు