CP Radhakrishnan: కొత్త ఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణన్.. ఆయన ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా!?

భారత కొత్త ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్. ఆర్ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన ఈయన దీనికి ముందు పలు పదవులను పోషించారు. ప్రస్తుతం ఈయన రూ.67 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారు. 

New Update
cp radhakrishna

సీపీ రాధాకృష్ణన్..16 ఏళ్ల నుంచి ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్‌గా పని చేసిన ఆయన.. 1974లో భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. బీజేపీలో వివిధ హోదాల్లో పని చేసిన రాధాకృష్ణన్ హైకమాండ్ వద్ద మంచి గుర్తింపు పొందారు. దీంతో 2004లో ఆయనను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వరించింది. 2007 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. 1998, 1999 ఎన్నికల్లో ఆయన కోయంబత్తూర్ ఎంపీగా ఆయన విజయం సాధించారు. 2004, 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయన అదే స్థానం నుంచి పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. సిపి రాధాకృష్ణన్ 40 ఏళ్ళకు పైగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. ఈయన రాజకీయాలతో పాటూ వ్యాపారాల్లో కూడా ఉన్నారు. వస్త్రాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్నారు. స్పైస్ టెక్స్‌టైల్స్, గుహాన్ టెక్స్‌టైల్ మిల్స్,  పరాణి స్పిన్నింగ్ మిల్స్ కంపెనీలు ఆయన పేరు మీదున్నాయి. దీంతో ఆయన పేరు మీద రూ. 67 కోట్ల వరకూ ఉన్నాయి.

చర, స్థిర ఆస్తుల వివరాలు

2019 లోక్‌సభ అఫిడవిట్ ప్రకారం.. రాధాకృష్ణన్ చరాస్తుల విలువ దాదాపు ₹ 7.31 కోట్లు. ఇందులో నగదు, బ్యాంకు డిపాజిట్లు, బాండ్లు, షేర్లు, బీమా పాలసీలు ఉన్నాయి. దీంతో పాటూ ఆయన భార్య యాజమాన్యంలోని బంగారం, వజ్రాలు ఉన్నాయి. ఈ బంగారం విలువ 1,285 గ్రాములు, వజ్రాలు 152 క్యారెట్ ఉన్నాయి.  దీని మొత్తం విలువ రూ. 1.37 కోట్ల కంటే ఎక్కువ ఉండొచ్చని చెబుతున్నారు. మరోవైపు, అతని స్థిర ఆస్తులలో వ్యవసాయ భూమి (రూ. 35 కోట్లు), వ్యవసాయేతర భూమి (రూ. 5.30 కోట్లు), వాణిజ్య భవనం (రూ. 6.63 కోట్లు) ఉండగా.. తమిళనాడులోని తిరుపూర్‌లో ఒక ఇల్లు (రూ. 1.50 కోట్లు) ఉన్నాయి. అయితే ఆస్తుల విలువలు ఇలా ఉండగా రాధాకృష్ణన్ అప్పులు కూడా  రూ. 2.36 కోట్ల రుణం కూడా ఉందని చెబుతున్నారు. 

అయితే అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..రాధాకృష్ణన్ కు కారు గానీ మే ఇతర వాహనాలు లేకపోవడం. అఫిడవిట్ ప్రకారం కారు లేదా బైక్ లేదని ఉంది. దీంతో ఇంత ఆస్తి ఉన్న ఆయనకు కారు లేకపోవడమేంటని అడుగుతున్నారు. ఇది రాజకీయ వర్గాల్లో , సామాన్య ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. 

Advertisment
తాజా కథనాలు