/rtv/media/media_files/2026/01/03/assam-2026-01-03-14-50-11.jpg)
Assam Assembly Elections
Assam Assembly Elections: అస్సాం అసెంబ్లీకి 2026 మార్చి - ఏప్రిల్ మధ్య జరగనున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని పీపుల్స్ పల్స్ సర్వే స్పష్టం చేసింది. మొత్తం 126 స్థానాలకు గాను బీజేపీ ఒంటరిగానే 69 నుంచి 74 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో బీజేపీ సుమారు 39 శాతం ఓట్లను పొందుతుందని అంచనా వేసింది.
కాంగ్రెస్‌కు గట్టి పోటీ.. కానీ:
ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ 37 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలవనుంది. ఆ పార్టీ 25 నుంచి 29 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. గత ఎన్నికలతో పోలిస్తే ఓటు షేరింగ్ పెరిగినప్పటికీ, మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోవడంలో కాంగ్రెస్ వెనుకబడే అవకాశం ఉంది. ఇతర పార్టీల విషయానికి వస్తే, అస్సోం గణ పరిషత్ (AGP) 7 శాతం, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ (BPF) 5.5 శాతం ఓట్లు సాధించవచ్చని సర్వే తేల్చింది.
సీఎంగా మళ్ళీ హిమాంత్ బిశ్వ శర్మకే మొగ్గు
ముఖ్యమంత్రిగా హిమాంత్ బిశ్వ శర్మ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు సర్వే ఫలితాలు చెబుతున్నాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 30 శాతం మంది ఆయననే మళ్ళీ సీఎంగా చూడాలని కోరుకుంటున్నారు. ఆయన నాయకత్వంలో జరిగిన అభివృద్ధి, నిర్ణయాలు బీజేపీకి సానుకూల పవనాలు తెచ్చిపెట్టాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు దాదాపు45 రోజుల పాటు పీపుల్స్ పల్స్ సంస్థ ఈ అధ్యయనం నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి5 వేల శాంపిల్స్‌ను సేకరించి ఈ అంచనాలను వెలువరించింది. ఈ ఫలితాలను బట్టి చూస్తే అస్సాంలో మరోసారి బీజేపీ హవా కొనసాగనుందని స్పష్టమవుతోంది.
Follow Us