PM Modi Helicopter: ప్రధాని మోదీకి తప్పిన ప్రమాదం..గాల్లో చక్కర్లు కొట్టిన హెలీకాప్టర్

పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీని ప్రకృతి భయపెట్టింది. దట్టమైన పొగమంచు కారణంగా ప్రధాని ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తాహెర్‌పుర్ హెలిప్యాడ్‌పై ల్యాండ్ కాలేకపోయింది. చాలాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది.

New Update
Modi

Modi

పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఊహించని వాతావరణ అంతరాయం ఎదురైంది. బెంగాల్ లో ప్రస్తుతం దట్టమైన పొగమంచు ఉంటోంది. దీని కారణంగా ప్రధాని ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ల్యాండ్ అవ్వలేకపోయింది. దీంతో పైలెట్లు హెలికాఫ్టర్ ను చాలాసేపుడాల్లోనే చక్కర్లు కొట్టించారు. అయితే ఎంత సేపటికీ పొగమంచు క్లియర్ కాకపోవడంతో భద్రతా కారణాల దృష్ట్యా పైలట్లు హెలికాప్టర్‌ను వెనక్కి మళ్లించి తిరిగి కోల్‌కతా విమానాశ్రయానికి చేర్చారు.

కప్పేసిన పొగ మంచు..

ఈరోజు ఉదయం పశ్చిమ బెంగాల్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీకోలకత్తా చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో తాహెర్ పూర్ కు బయలుదేరారు. అయితే ప్రస్తుతం ఉత్తర భారత దేశంతో పాటు తూర్పు రాష్ట్రాలను కప్పేసిన దట్టమైన పొగమంచు.. ప్రధాని పర్యటనపై ప్రభావం చూపింది. హెలికాప్టర్ తాహెర్‌పుర్ హెలిప్యాడ్ సమీపానికి చేరుకున్నప్పటికీ.. అక్కడ విజిబులిటీఅత్యంతతక్కువగాఉండటంతోల్యాండింగ్‌కుసాధ్యపడలేదు. కొంతసేపువెయిట్చేసినా మంచు విడివడలేదు. దాంతో హెలికాఫ్టర్ ను మళ్ళీ కోలకత్తా తిరిగి తీసుకెళ్ళిపోయారు. హెలికాప్టర్ వెనక్కి మళ్లిన తర్వాత ప్రధాని మోదీకోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయారు. వాతావరణం కాస్త తేరుకుని.. పొగమంచు విడిపోయే వరకు ఆయన అక్కడే వేచిచూశారు. వాతావరణ శాఖ క్లియరెన్స్ఇచ్చాకనే ప్రధాని కోలకత్తా నుంచి బయలుదేరారు.

ప్రధాని వంటి అత్యున్నత స్థాయి వ్యక్తుల పర్యటనలో భద్రతా ప్రమాణాలు అత్యంత కఠినంగా ఉంటాయి. అందుకే విజిబులిటీ తక్కువగా ఉన్నప్పుడు ల్యాండింగ్ చేయడం ప్రమాదకరమని భావించిన ఎయిర్ ఫోర్స్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వాతావరణం మెరుగుపడే వరకు ప్రధాని పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.

Advertisment
తాజా కథనాలు