Pawan Kalyan Campagin:
పవన్ కల్యాణ్ మ్యాజిక్ బీజేపీకి విజయాన్ని తెచ్చిపెట్టింది. ఆయన మహారాష్ట్రా ఎన్నికల్లో ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లోని అభ్యర్థులూ విజయం సాధించారు. తెలుగు, హిందీ, మరాఠీ భాషల్లో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ చేసిన ప్రచారం మహారాష్ట్ర ఓటర్ల మీద బాగా ప్రభావం చూపించిందనే చెప్పాలి. అయితే ఒక్కచోట మాత్ర పవన్ మ్యాజిక్ వర్కౌట్ అవ్వలేదు. లాతూర్ నియోజకవర్గంలో మాత్రం పవన్ కళ్యాణ్ ప్రచారం ఏం ఉపయోగపడలేదు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ధీరజ్ విలాస్ రావు దేశముఖ్ చేతిలో బీజేపీ అభ్యర్థి అర్చన పాటిల్ చాకుర్కర్ ఓడిపోయారు. ధీరజ్ హీరో రితేష దేశ్ ముఖ్ అన్నయ్య. దివంగత విలాస్ రావ్ దేశ్‌ముఖ్ కుమారుడు.
Also Read: Delhi: 50 ఏళ్ళల్లో ఈ కూటమీ ఇంతటి విజయాన్ని సాధించలేదు– మోదీ
లాతూర్‌లో ధీరజ్ విలాస్ రావు దేశ్ ముఖ్ కి 1 లక్ష 14వేల 110 ఓట్లు పోల్ అవ్వగా.. అర్చన చాకుర్కర్ కి 1 లక్ష 6 వేల 712 ఓట్లు వచ్చాయి. దీంతో అర్చనా 6 వేల 973 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ ఒక్కచోట మాత్రమే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం పనిచేయలేదు. ఇప్పుడు ఈ విషం మీద సోషల్ మీడియా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Also Read: Cricket: హార్దిక్ అరుదైన రికార్డ్..లిస్ట్‌లో టాప్ క్రికెటర్