Cricket: హార్దిక్ అరుదైన రికార్డ్..లిస్ట్‌లో టాప్ క్రికెటర్ హార్దిక పాండ్యా బ్యాగ్‌లో మరో అరుదైన రికార్డ్ వచ్చి చేరింది. టీ20ల్లో 5వేల పరుగులు , వంద వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా పాండ్యా చరిత్ర సృష్టించాడు. గుజరాత్‌లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీల్లో పాండ్యా ఈ ఫీట్ సాధించాడు. By Manogna alamuru 23 Nov 2024 in స్పోర్ట్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్. ఇతని ఆట గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలా టోర్నీల్లో హార్దిక్ తానేంటో...తన మ్యాజిక్ ఏంటో నిరూపించేసుకున్నాడు. ఇప్పుడు తాజాగా మరో అరుదైన రికార్డ్ సాధించాడు. టీ20 క్రికెట్‌లో 5 వేల పరుగులు, 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా తరఫున ఆడుతున్నాడు హార్దిక్ పాండ్యా. దీనిలో ఈ రికార్డ్ ను అధిమించాడు. ఈమ్యాచ్ గుజరాత్‌లో జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని బరోడా ఐదు వికెట్లు కోల్పోయి మూడు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఐదో స్థానంలో వచ్చిన హార్దిక్ పాండ్య 35 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74 పరుగులు చేశాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన హార్దిక్ ఒక వికెట్ కూడా పడగొట్టాడు. దీంతో టీ20ల్లో 5వేల పరుగులు, 100 వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతేకాఉ ఆ లిస్ట్‌లో ఉన్న అందరినీ దాటేసి మొదటి స్థానంలో నిలిచాడు కూడా. Also Read: Delhi: 50 ఏళ్ళల్లో ఈ కూటమీ ఇంతటి విజయాన్ని సాధించలేదు– మోదీ రికార్డ్ సాధించిన భారత ఆటగాళ్ళు హార్దిక్ పాండ్య- (5,067 పరుగులు, 180 వికెట్లు) రవీంద్ర జడేజా - (3,684 పరుగులు, 225 వికెట్లు)అక్షర్ పటేల్ -(2,960 పరుగులు, 227 వికెట్లు)కృనాల్ పాండ్య- (2,712 పరుగులు, 138 వికెట్లు)ఇర్ఫాన్ పఠాన్ - (2,020 పరుగులు, 173 వికెట్లు) Also Read: జార్ఖండ్ కౌంటింగ్ పూర్తి..ఇండియా కూటమికి వచ్చిన సీట్లు ఎన్నో తెలుసా? మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి