జార్ఖండ్‌లో కౌంటింగ్ పూర్తి..ఇండియా కూటమికి వచ్చిన సీట్లు ఎన్నో తెలుసా?

జార్ఖండ్‌లో మొత్తం 81 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో ఇండియా కూటమి మ్యాజిక్‌ ఫిగర్‌‌ 41ను దాటి 56 స్థానాలతో విజయం సాధించింది.  బీజేపీ 26 స్థానాల్లో గెలుపొందింది.

author-image
By Manogna alamuru
New Update
HEMANTH SOREN

Final Result: 

జార్ఖండ్‌లో ఇండియా కూటమి విజయభేరి మోగించింది. ఫలితం తెలిసి చాలాసేపు అయినా...కొద్దిసేపటి క్రితమే మొత్తం అన్ని స్థానాల్లో రిజల్ట్ వెలువడ్డాయి. ఇండియా కూటమి 56 స్థానాల్లో విజయం సాధించింది. జేఎంఎం34, కాంగ్రెస్ 16, సీపీఐ-ఎం(CPI-M) 2, ఆర్‌జేడీ (RJD) 4 కలిపి మొత్తం ఇండియా కూటమికి 56 సీట్లు వచ్చాయి. మరోవైపు బీజేపీ కూటమి 24 స్థానాల్లో గెలుపొందింది. ఇందులో బీజేపీ ఒంటరిగా 21 సీట్లు సాధించింది. బీజేపీ మద్దతుదారు ఏజేఎస్‌యూ పార్టీ (AJSU Party) 1, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 1, జనతాదళ్ (యునైటెడ్) 1 చొప్పున సీట్లు సాధించాయి.

జార్ఖండ్‌లో బీజేపీ ఘోరంగా విఫలమయిందనే చెప్పాలి. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ లాంటి బీజేపీ అగ్రనేతలు  అందరూ ఇక్కడ దూకుడుగా ప్రచారం చేశారు. దాదాపు 200 ర్యాలీల్లో బీజేపీ నేతలు ప్రసంగించారు. వీటిలో రెండు డజన్ల బహిరంగ సభలను అమిత్ షా, ప్రధాని మోడీ పాల్గొన్నారు. అయినప్పటికీ ఎన్డీయే విజయం సాధించలేదు. ముఖ్యంగా లోకల్ పార్టీ నేతల పరాజయం ఈ పార్టీని బాగా దెబ్బ తీసింది.

Also Read: Delhi: 50 ఏళ్ళల్లో ఈ కూటమీ ఇంతటి విజయాన్ని సాధించలేదు– మోదీ

Advertisment
Advertisment
తాజా కథనాలు