/rtv/media/media_files/2025/05/10/8tvLJu77oIHprNqCNjmw.jpg)
india pakistan war updates
Pakistan India War: భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం నాలుగో రోజుకూ చేరింది. పాకిస్థాన్, భారతదేశంలోని 26 ప్రాంతాలపై దాడి చేయాలనుకున్న ప్రయత్నాలకు భారత్ అడ్డుకట్ట వేసింది. ఎయిర్-టు-సర్ఫేస్ మిస్సైల్‌ను ప్రయోగించింది. ఈ ఘటన పాకిస్థాన్‌ను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. పాకిస్తాన్ వెనక్కి తగ్గకపోతే మరింత గట్టిగా ఎదుర్కొంటామని భారత్ స్పష్టమైన సంకేతాలు పంపించింది.
Also Read: BIG BREAKING: పాక్ ఫైటర్ జెట్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్న భారత్
భారత్, పాకిస్థాన్ కీలక స్థావరాలపై దాడులు జరిపింది. ఈ దాడుల్లో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌తో పాటు సరిహద్దుకు సమీపంలో ఉన్న లాహోర్, రావల్పిండి, షేక్‌పురా నగరాలు ఉన్నాయి. అలాగే మూడు ప్రధాన ఎయిర్‌బేస్‌లపై కూడా భారత్ దాడులు జరిపింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్, షార్కోట్ సమీపంలోని రఫికి ఎయిర్‌బేస్, చక్వాల్ వద్ద ఉన్న మురిద్ ఎయిర్‌బేస్‌లుపై భారత్ దాడులతో విరుచుకుపడుతోంది.
Also Read: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా
Also Read: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు
భారతదేశం, పాకిస్థాన్ ఉద్రిక్తతలు మధ్య చోటుచేసుకున్న కీలక పరిణామాలు:
- పాక్, నాలుగో రోజు భారతదేశంలోని 26 ప్రాంతాలపై డ్రోన్లతో దాడులకు యత్నించగా, భారత్ గట్టిగా ప్రతి దాడికి దిగింది.
- భారత్, గాలిలో నుంచి భూమిని లక్ష్యంగా చేసే ఎయిర్-టు-సర్ఫేస్ మిస్సైల్‌ను ప్రయోగించి, పాకిస్థాన్‌కు గట్టి షాకిచ్చింది.
- పాక్ ఉగ్రదాడులకు భారత్ ప్రతిస్పందనగా లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి నగరాల్లో బాంబు దాడులు జరిపింది.
- పాకిస్థాన్ సరిహద్దు గ్రామాలపై దాడి చేసి 13 మంది భారతీయులను చంపిన తర్వాత ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి.
- భారత వాయుసేన, పాకిస్థాన్‌లోని మిలిటరీ ఎయిర్ బేస్‌లపై లక్ష్యంగా దాడులు చేసింది.
- పాక్ ప్రధాని ప్రస్తుతం ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నాడు.
- భారత్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్య నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు, ఎయిర్‌పోర్టుల్లో సెక్యూరిటీ మరింత పెంచారు.
- పాకిస్థాన్, రాత్రి నుంచి భారత్‌లోని 15 నగరాలపై దాడులకు యత్నించింది.
- ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాష్ట్రాల సీఎంలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ చర్యలు తీసుకుంటున్నారు.
- ఇప్పటివరకు భారత్, పాక్‌లోని తొమ్మిది ప్రధాన నగరాలపై కౌంటర్ దాడులు జరిపింది.
Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!