బంగ్లాదేశ్‌తో పాక్ రహస్య ఒప్పందం.. ఇది ఇండియాకు చాలా ప్రమాదం?

పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల మధ్య జరుగుతున్న రహస్య ఒప్పందంపై నిఘా నివేదిక లీక్ కావడంతో భారత భద్రతా వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ నివేదిక ప్రకారం, పాకిస్తాన్ బంగ్లాదేశ్‌కు అధునాతన డ్రోన్ వార్‌ఫేర్ టెక్నాలజీని బదిలీ చేస్తున్నట్లు వెల్లడైంది.

New Update
Pakistan doing secret deal

Pakistan secret deal with Bangladesh

పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల మధ్య జరుగుతున్న రహస్య  ఒప్పందంపై నిఘా నివేదిక లీక్ కావడంతో భారత భద్రతా వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ నివేదిక ప్రకారం, పాకిస్తాన్ బంగ్లాదేశ్‌కు అధునాతన డ్రోన్ వార్‌ఫేర్ టెక్నాలజీని బదిలీ చేస్తున్నట్లు వెల్లడైంది. భారత్‌కు తూర్పు మరియు పశ్చిమ సరిహద్దుల నుండి ఒకేసారి భద్రతా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 15 నుండి 19 వరకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వైమానిక దళాల ఉన్నతాధికారుల మధ్య రహస్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో డ్రోన్ యుద్ధం, వ్యూహాత్మక కమ్యూనికేషన్లు, అంతరిక్ష కార్యకలాపాలు, సైబర్ సెక్యూరిటీ వంటి కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ ఒప్పందం ద్వారా పాకిస్తాన్ బంగ్లాదేశ్‌కు తమ డ్రోన్ టెక్నాలజీని అందించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఈ డ్రోన్ సాంకేతికతను చైనా సహాయంతో అభివృద్ధి చేసింది. 

ఇరుదేశాల వైమానిక దళ చీఫ్‌లు డ్రోన్ యుద్ధం, వ్యూహాత్మక కమ్యూనికేషన్లు, అంతరిక్ష కార్యకలాపాలు, సైబర్ సెక్యూరిటీ సిస్టమ్‌, ప్రపంచ రాజకీయ పరిస్థితులు మొదలైన విషయాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డ్రోన్ స్వార్మింగ్, అటానమస్ ఎయిర్ కంబాట్ సిస్టమ్‌లకు కీలకమైన మాడ్యులర్, అన్‌మ్యాన్డ్ మిషన్ ట్రైనర్స్ (MUMT–UMT) సిమ్యులేటర్‌ల ఉమ్మడి అభివృద్ధిపై వీరు ప్రధానంగా దృష్టిపెట్టినట్లు సమాచారం. కాగా చైనా సహాయంతో తన డ్రోన్ యుద్ధ సామర్థ్యాలను పాకిస్థాన్‌ మెరుగుపరుచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ కార్యాచరణ పరిజ్ఞానాన్ని దాయాది దేశం ఢాకాకు కూడా బదిలీ చేస్తున్నట్లు భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి. 

ఈ పరిణామం భారత్‌కు తీవ్ర ఆందోళన కలిగించే అంశం. బంగ్లాదేశ్ భారత్‌కు తూర్పు సరిహద్దులో ఉండగా, పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దులో ఉంది. ఈ రెండు దేశాలు ఒక కూటమిగా ఏర్పడితే, భారత్ రెండు వైపుల నుంచి సైనిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇటీవల బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి, మహమ్మద్ యూనుస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, బంగ్లాదేశ్ పాకిస్తాన్‌కు దగ్గరవుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ఉన్నతాధికారులు కూడా బంగ్లాదేశ్‌లో రహస్యంగా పర్యటించినట్లు వార్తలు వచ్చాయి.

Advertisment
తాజా కథనాలు