BIG BREAKING: మళ్లీ దాడులకు దిగిన పాక్!

పాకిస్థాన్ మరోసారి బరితెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తూనే ఉంది. ఉరి సెక్టార్‌లో మరోసారి దాడులకు పాల్పడింది. గొహల్లాన్ ప్రాంతంలో పాక్‌ కాల్పులకు పాల్పడింది.

New Update
Pakistan Attacked in URI

Pakistan Attacked in URI

పాకిస్థాన్ మరోసారి బరితెగించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తూనే ఉంది. ఉరి సెక్టార్‌లో మరోసారి దాడులకు పాల్పడింది. గొహల్లాన్ ప్రాంతంలో పాక్‌ కాల్పులకు పాల్పడింది. ఈ దాడుల్లో 45 ఏళ్ల మహిళ మృతి చెందారు. ఆమె కుటుంబానికి ఇద్దరు బంధువులు గాయపడ్డారు. వాళ్లు ప్రయాణిస్తున్న కారును పాక్ ఆర్టిలరీ షెల్ తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. 

Also Read: పాక్‌కు దెబ్బ మీద దెబ్బ.. సింధూ జలాల ఒప్పందంపై వరల్డ్ బ్యాంక్ కీలక ప్రకటన!

పాకిస్థాన్ దాడులకు బదులిచ్చామని ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే గురువారం రాత్రి నుంచి పాక్ షెల్లింగ్‌కు దిగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాల్పులకు కాసేపు విరామం ఇచ్చినా కూడా శుక్రవారం ఉదయం ఆర్టిలరీ దాడులు జరిగినట్లు పేర్కొన్నాయి. గింజిల్, మొహురా,కమాల్‌కోట్, బొనియార్ లాంటి సరిహద్దు ప్రాంతాల్లో పౌరుల నివాసాలే టార్గెట్‌గా ఈ దాడులకు పాల్పడింది. దీంతో చాలా ఇళ్లకు నష్టం కలిగినట్లు తెలుస్తోంది.దీంతో ఉరి సెక్టార్‌లో కూడా సైరన్‌లు మోగాయి. LOC వెంట కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది.  

ఇదిలాఉండగా.. ఇండియా-పాక్ సింధుజలాల ఒప్పందంలో ప్రపంచబ్యాంక్ జోక్యం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ప్రపంచ బ్యాంక్ వాటిని ఖండించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందనే దానిపై చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయని.. కానీ అవన్నీ అర్థం చెప్పింది. ప్రపంచబ్యాక్ పాత్ర ఒక సహాయకారిగా మాత్రమే ఉంటుందని పేర్కొంది. 

rtv-news 

Advertisment
తాజా కథనాలు