ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిద్ధిఖీ హత్యకు మూడు తుపాకులు వినియోగించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. అయితే తాజాగా నిందితులు నాలుగు తుపాకులు ఉపయోగించారని తెలిపారు. అంతేగాక వీటిని పాకిస్థాన్ నుంచి తీసుకొచ్చినట్లు తెలిపారు. డ్రోన్ సాయంతో వీటిని దేశ సరిహద్దులు దాటించారని.. ఆ తర్వాత వీటిని నిందితులు తీసుకున్నారని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు.
Also Read: రూ.10 నాణేలు చెల్లుతాయి.. లావాదేవీలకు వాడొచ్చు
ఇప్పటివరకు 14 మంది అరెస్టు
తూర్పు బాంద్రాలోని తన కుమారుడు, ఎమ్మె్ల్యే జీషన్ సిద్ధిఖీ కార్యాలయం సమీపంలో బాబా సిద్ధిఖీ హత్యకు గురైన విషయం తెలిసిందే. అక్టోబర్ 12న జరిగిన ఈ ఘటనకు తామే కారణమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కూడా ప్రకటన చేసింది. దీనికి సంబంధించి ఇప్పటిదాకా 14 మందిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
Also Read: గుడ్‌న్యూస్.. దీపావళి పండగకు 6 రోజులు సెలవులు
ప్రధాన నిందితుడిగా శివ్‌కుమార్ గౌతమ్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హర్యానాకు చెందిన గుర్‌మైల్ బల్జీత్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ కశ్యప్, శివ్‌కుమార్ గౌతమ్ అనే ముగ్గురు నిందితులు సిద్ధిఖీని కాల్చి చంపేశారు. శివ్‌కుమార్ గౌతమ్‌కు తుపాకులు ఎలా వాడాలో తెలుసు. అంతేకాదు అతడు గతంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన వేడుకల్లో గాలిలోకి కాల్పులు జరిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అతడినే ఈ కేసులో ప్రధాన షూటర్‌గా పోలీసులు భావిస్తున్నారు.