/rtv/media/media_files/2025/04/24/S1UrYDRbgsZZR8YZEx6Q.jpg)
assam-mla
పహల్గాం ఉగ్రదాడి వెనుక ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు ఉన్నారంటూ అస్సాం ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం సంచలన ఆరోపణలు చేశారు. 2018లో కూడా పుల్వామా దాడిలో కూడా కేంద్రం పాత్ర ఉందని తాను నమ్ముతున్నానని.. అందుకే 2019 ఎన్నికల్లో బీజేపీ గెలించిందన్నారు. పుల్వామా దాడి లాగే పహల్గాం ఉగ్రదాడి వెనుక ప్రభుత్వ పాత్ర ఉందనే తాను అనుకుంటున్నానని తెలిపారు. నిజం తేల్చాలని లేకపోతే ఈ ఎటాక్స్ వెనుక మోదీ, అమిత్ షాలు ఉన్నారని నమ్మాల్సి వస్తుందని అన్నారు. అయితే ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం ఆరోపణలపై ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వా శర్మ స్పందించారు. పాకిస్తానీ దలాల్‌లుగా వ్యవహరించే పౌరులపై ప్రభుత్వం సాధ్యమైనంత బలమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
🚨 SHAMEFUL! AIUDF MLA Aminul Islam: "Pahalgam attack was orchestrated by PM Narendra Modi, and HMO Amit Shah incited Hindu-Muslim division."
— Rupa Paul (@Sanjit_Rupa) April 24, 2025
— STRICT ACTION must be taken against such anti-social elements. @himantabiswa ji plz#PahalgamTerroristAttack pic.twitter.com/Jv6Ow3Qcyr