Maoist: మావోయిస్టులపై ఆఖరి ఆపరేషన్!

మవోయిస్టు రహిత దేశమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం దూసుకెళ్తోంది. ‘సల్వాజుడుం’ పేరుతో మొదలైన దాడి ఇప్పుడు ‘ఆపరేషన్ కగార్‌ 2026’గా కొనసాగుతోంది. నక్సల్స్ ఏరివేతలో భాగంగా కేంద్రం అనుసరిస్తున్న విధానాలేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ చదవండి. 

author-image
By srinivas
Maoists
New Update

Maoist : ఇండియాను మవోయిస్టు రహిత దేశంగా మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. 2014లో దేశంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ.. నక్సల్స్ ఏరివేతకోసం వరుస ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గ్రీన్ హంట్ ను కొనసాగిస్తూనే వివిధ దశలుగా కొత్త ఆఫరేషన్స్ చేపడుతూ మావోయిస్టు పార్టీని కోలుకోలేని దెబ్బతీస్తోంది. వ్యూహాత్మక వరుస దాడులతో నక్సలైట్లను తుదముట్టించేందుకు ముందుడుగులు వేస్తోంది. ఇటీవల ఒకే ఎన్ కౌంటర్ లో 36 మందిని, ఆ తర్వాత మరో నలుగురిని మొత్తంగా నెలరోజుల్లోనే 40 మంది మవోయిస్టులను మట్టుబెట్టింది. అయితే ఇదే ఆఖరి పోరాటంగా చెబతున్న కేంద్ర ప్రభుత్వం.. ఆపరేషన్ కాగార్ కోసం కొత్త ఎత్తుగడలు వేస్తోంది. దేశంలో 2026 మార్చి కల్లా మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించగా.. సల్వాజుడుం పేరుతో 2007లో మొదలైన మావోయిస్టుల ఏరివేత ఇప్పుడు ఆపరేషన్‌ కగార్‌ (ఫైనల్‌ మిషన్‌)కు చేరుకుంది. ఈ మేరకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ప్రభుత్వాలు వేస్తున్న ప్రణాళికలేంటి? ఎలా సక్సెస్ అయ్యాయో తెలుసుకుందాం.  

ఇది కూడా చదవండి: Pooja Hegde : శ్రీలీలకు భారీ షాక్ ఇచ్చిన పూజా హెగ్డే?

ఆ తెగకు చెందిన యువకుల సాయంతో..


ఈ మేరకు పశ్చిమ బెంగాల్‌లో మావోయిస్టులను అణచివేయడంలో కీలక పాత్ర పోషించిన నాగా బెటాలియన్‌ను బస్తర్‌ అడవులకు పంపాలని నిర్ణయించింది. వీరి అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ వాహనాలు, శాటిలైట్‌ ఫోన్లు అందించింది. కోబ్రా దళాలు రంగంలో ఉన్నప్పటికీ ఫలితాలు పెద్దగా లేకపోవడంతో మరిన్ని బలగాలను అడవిలోకి పంపించేందుకు ప్రయత్నిస్తోంది. గతంలోనూ మావోయిస్టులకు మద్దతుగా నిలిచే మరో తెగకు చెందిన యువకులను ప్రత్యేక పోలీసు అధికారులుగా నియమించి, వారికి ఆయుధాలిచ్చి శాంతిదళం (సల్వాజుడుం)ను 2007లో ఏర్పాటు చేయగా.. సల్వాజుడుం 2011లో రద్దయ్యే వరకు వివాదాలకు కేంద్రంగా నిలిచింది. 

ఇది కూడా చదవండి: ఆ విషయంలో కార్తీని చూస్తే అసూయగా ఉంటుంది.. సూర్య షాకింగ్ కామెంట్స్

బస్తర్‌ అడవులపై చిక్కని పట్టు..

ఇక 2009లో ‘ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌’ పేరిట సీఆర్‌పీఎఫ్‌ బలగాలను బస్తర్‌ అడవుల్లోకి పంపించింది కేంద్రం ప్రభుత్వం. అయితే ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ వల్ల భద్రతా బలగాలు భారీగా నష్టపోయాయి. బస్తర్‌ అడవులపై ప్రభుత్వ దళాలకు పట్టు చిక్కకపోవడంతో ఇది కూడా అనుకున్నంత ఫలితాలనివ్వలేదు. ఆ తర్వాత యాంటీ మావోయిస్టు ఆపరేషన్లు చేపట్టి పదేళ్లు దాటినా బస్తర్‌ అడవులపై పట్టు చిక్కకపోవడానికి వ్యూహాల్లో లోపాలే కారణమని కేంద్రం భావించింది. దీంతో 2017లో ఆపరేషన్‌ సమాధాన్‌ (ఎస్‌ – స్మార్ట్‌ లీడర్‌, ఏఎస్ – అగ్రెసివ్‌ స్ట్రాటెజీ, ఎం – మోటివేషన్‌ అండ్‌ ట్రైనింగ్, ఏ – యాక్షనబుల్‌ ఇంటెలిజెన్స్, డీ – డ్యాష్‌బోర్డ్‌ బేస్డ్‌ కీ రిజల్ట్‌ ఏరియా, హెచ్‌ – హర్నెస్టింగ్‌ టెక్నాలజీ, ఏ –యాక్షన్‌ ప్లాన్, ఎన్‌ – నో ఆక్సెస్‌ టు ఫైనాన్సింగ్‌ను ప్రవేశపెట్టింది.   

ఇది కూడా చదవండి: పేలని మంత్రి పొంగులేటి పొలిటికల్ బాంబు.. కారణం అదేనా?

మాజీలు, లొంగిపోయిన వారే కీలకంగా.. 
ఈ క్రమంలోనే ఆపరేషన్‌ సమాధాన్‌ సక్సెస్ అయినట్లు నిర్ధారణకు వచ్చిన కేంద్రం.. ఆ తర్వాత 2021 జూన్‌ 19న తొలిసారిగా వాయుమార్గంలో మావోయిస్టు శిబిరాలపై దాడులకు పాల్పడింది. దీంతో మావోయిస్టు శిబిరాలపై వాయుమార్గంలో దాడులు చేయడంపై విమర్శలు రావడంతో విరమించుకున్నట్లు ప్రకటించి.. మరో నాలుగుసార్లు గగనతల దాడులు జరిపింది. ఇందులో భాగంగానే మావోయిస్టుల ఆర్థిక వనరులపై దెబ్బ కొట్టింది. స్థావరాలను కనుక్కోవడం, మెడిసిన్ అందకుండా చూడటం, మావోయిస్టు రిక్రూట్ మెంట్ జరగకుండా జాగ్రత్త పడటంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టారు. కేంద్రం, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు సరికొత్త వ్యూహాలను అమల్లోకి తీసుకొచ్చాయి.  లొంగిపోయిన, అరెస్టయిన మావోయిస్టులతోనే ప్రత్యేక దళాలను నిర్మించి అడవులపై పట్టు సాధించుంకుంటూ ముందుకెళ్తోంది. 

ఇది కూడా చదవండి: Iran సుప్రీం లీడర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. తర్వాతి వారసుడు ఆయనేనా

ప్రస్తుతం చేపట్టిన ఆపరేషన్ కగార్ లో.. లేటెస్ట్‌ టెక్నాలజీ ఆధారంగా బస్తర్‌ అడవుల్లో పట్టు సాధిస్తోంది. 2024 జనవరిలో ప్రారంభించిన మిషన్ లో ప్రతీ 6 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంపు ఏర్పాటు చేస్తూ.. మావోయిస్టులకు ఊపిరాడకుండా చేస్తోంది. మొత్తం 370కి పైగా పారా మిలిటరీ క్యాంపులు ఏర్పాటు చేయగా.. దండకారణ్యంలోని  మావోయిస్టుల గెరిల్లా జోన్లు, పలు జిల్లాలు భద్రతాబలగాల ఆధీనంలో ఉంటున్నాయి. దీంతో మావోయిస్టుల్లో తీవ్ర ఒత్తిడి పెరిగిపోయింది. అగ్రనేత హిడ్మా పువర్తిలోనూ భద్రతా దళాలు క్యాంపును ఏర్పాటు చేసి, ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సీఆర్‌పీఎఫ్, డీఆర్‌జీ, స్పెషల్‌ టాస్క్ ఫోర్స్, కోబ్రా, పోలీసులు ఇలా వివిధ భద్రతా బలగాలు మావోయిస్టుల షెల్టర్‌ జోన్‌గా ఉన్న అబూజ్‌మడ్‌ (బీజాపూర్, నారాయణ్‌పూర్, కాంకేర్, కొండగావ్‌) అడవులను జల్లెడపడుతున్నాయి. కాలాలకు అనుగుణంగా సూర్యశక్తి, ఆపరేషన్‌ జల్‌శక్తి పేర్లతో జవాన్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, దాడులు చేయిస్తోంది. ఫలితంగా అక్టోబర్ నెలలో 50 మంది వరకు చనిపోగా.. 400 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయినట్లు కేంద్రం చెబుతోంది. మావోయిస్టు అగ్రనేతలు సైతం చేతులేత్తేసే అవకాశం ఉందని, త్వరలోనే పూర్తిగా నక్సలిజాన్ని తుడిచిపెడతామంటూ అధికారులు చెబుతున్నారు. 

ప్రజా సంఘాలు, మేధావులపై కేసులు.. 
మరోవైపు మవోయిస్టు సిద్ధాంతాన్ని సమర్థించేవారిని మోదీ ప్రభుత్వం తీవ్ర నిర్భందానికి గురిచేస్తోంది. మేధావి వర్గం నోర్లు నొక్కేస్తోంది. పబ్లిక్ వేదికలపై మాట్లాడకుండా గొంతు నొక్కేసి వక్తలను జైళ్లలో నిర్భంధిస్తోంది. మావోయిస్టులపై దాడులను ప్రశ్నించే వారిని అర్బన్ నక్సలైట్లుగా ముద్రిస్తూ కేసులు పెడుతోంది. మొత్తంగా బాహ్యప్రపంచంనుంచి మావోయిస్టులకు ఎలాంటి మద్ధతు లభించకుండా చేసి, తమ ఆపరేషన్స్ కొనసాగిస్తోంది కేంద్ర ప్రభుత్వం. 

#bjp #maoist #amith-sha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe