56 ఏళ్ళ తేడా.. కానీ రతన్ టాటాకు క్లోజ్ ఫ్రెండ్..అసలెవరీ శాంతను?

రతన్ టాటా ఫ్రెండ్ అంటే అదే ఏజ్ వారు...లేదా ఏ పెద్ద పారిశ్రామిక వేత్త, ఫిలాసఫర్ , రాజకీయ నాయకుడు ఇలా ఊహించుకుంటాము కదా. కానీ ఆయనకు అత్యంత సన్నిహితుడు ఓ 31 ఏళ్ళ కుర్రాడు. అతని పేరే శాంతను నాయుడు. 

New Update
ratan

Ratan TATA and Santhanu: 

గుడ్‌ బై మైడియర్ లైట్ హౌస్ అంటూ ఓ కుర్రాడు ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. మీ నిష్క్రమణతో మన స్నేహంలో శూన్యం మిగిలింది.. ఆ లోటును అధిగమించడానికి ఈ జీవితాంతం ప్రయత్నిస్తాను. ఈ ప్రేమ దూరమవడంతో కలుగుతోన్న దు:ఖం పూడ్చలేనిది అంటూ రతన్ టాటా గురించి ఎమోషనల్ అయ్యాడు. అదెవరో కాదు ఆయన చనిపోయేంత వరకూ కుడభుజంగా మెలిగిన శాంతను నాయుడు. రతన్ టాటాకు అత్యంతిష్టమైన వ్యక్తుల్లో ఈ తెలుగు కుర్రాడు ముందుంటాడు. దాదాపు 50 ఏళ్ళ  వయసు తేడా ఉన్నా ఇద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ అని చెబుతుంటారు. అంతేకాదు టాటా ట్రస్ట్ లో పిన్న వయస్సు కలిగిన జనరల్ మేనేజర్ గా, టాటాకు అత్యంత విశ్వాస పాత్రుడైన అసిస్టెంట్ గా శంతను వ్యవహరించారు. టాటా అంతర్గత వ్యవహారాల్లో అత్యంత కీలకమైన పాత్ర పోషించాడు కూడా.

అసలు వీళ్ళిద్దరికీ స్నేహం ఎలా కుదిరింది?

టాటా కంపెనీలో శాంను ఒక ఉద్యోగి. కానీ రతన టాటాకు అతనెవరో కూడా  తెలియదు. లక్షల మంది ఉద్యోగుల్లో శాంతను ఒకడు. దీని దవారా వీళ్ళిద్దరూ కలవలేదు. రతన్, శాంతను ను కలిపింది కుక్కల మీద ఉన్న ప్రేమ. పూణెలోని టాటా కంపెనీలో శాంతను పనిచేస్తున్నప్పుడు మెటాపాస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించేవాడు. ఇదేంటంటే...వీధి కుక్కల మెడకు రాత్రిపూట మెరిసే కాలర్లు వేయడం. దీని వలన అవి యాక్సిడెంట్లలో చనిపోకుండా ఉన్నాయన్నది వారి ఆలోచన. దీని గురించి అప్పట్లో వార్తు వచ్చాయి. అలాగే టాటా సంస్థ న్యూస్‌ లెటర్‌‌లో కూడా ప్రధానంగా వచ్చింది.  దీనిని చూసే రతన్ టాటా శాంతనును కలవడానికి ఆహ్వానించారు. అలా మొదలైన వాళ్ళ పరిచయం మెటాపాస్ ద్వారా మరింత బలపడింది. ఒకరి గురించి ఒకరు స్వయంగా పట్టించుకునేంతవరకూ వెళ్ళింది. తర్వాత శాంతను చదువుకోవడానికి వెళ్ళడం...రతన్ చదివిన కార్నెల్ యూనివర్శిటీలోనే శాంతను కూడా చదవడం ఇలా అన్నీ జరిగిపోయాయి. ఈ మధ్య కాలంలో వీరి స్నేహం మరింత బలపడింది. 

r1

వెటర్నరీ ఆసుపత్రి...

ఈక్రమంలో రతన్ టాటా కల అయిన ముంబయ్‌లో వెటర్నరీ ఆసుపత్రి స్థాపించడం..దీని కోసం శాంతను నడుం బిగించాడు. ఆప్రాజెక్టు మీదనే పని చేశాడు. మొత్తానికి సఫలమయ్యేలా చేశాడు. టాటా గ్రూప్ లో ఒకవైపు రతన్ టాటాకు జనరల్ మేనేజర్ గా తన విధులు నిర్వర్తిస్తూనే శంతను నాయుడు మరో స్టార్టప్ కూడా ప్రారంభించాడు. అదే సీనియర్ సిటిజెన్లకు చేదోడుగా ఉండేందుకు ఉద్దేశించిన గుడ్‌ఫెల్లోస్. దీనిలో రతన్ టాటా పెట్టుబడులు కూడా పెట్టారు. పెద్ద వయస్సులతో స్నేహం వల్ల కలిగే ప్రయోజనాలు, వృద్ధాప్యంలో వారిపై చూపాల్సిన ఆప్యాయత.. రతన్ జీతో స్నేహం వల్లే తనకు తెలిసిందని శాంతను చెబుతాడు.

r2

ఐ కేమ్ అపాన్ ఎ లైట్ హౌస్..

శాంతనును రతన్ టాటా ఎంతలా అభిమానించేవారు అంటే...అతను కార్నెల్ యనివర్శిటీలో చదువుకునేప్పుడు ఒకరోజు త్వరలో తన గ్రాడ్యుయషన్ డే అని రతన్‌కు చెప్పాడు. అంతే ఆ రోజు రతన్ అక్కడ ఆ గ్రాడ్యుయేషన్‌ కు హాజరయ్యారు. ఇది శాంతను కూడా ఊహించలేదు. అప్పుడు తనకు తెలిఇంది రతన్ తనను ఎంతలా ప్రేమిస్తున్నారో అని అంటాడు శాంతను. అందుకే ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఒక పుస్తకంగా కూడ తీసుకువచ్చాడు శాంతను. ఐ కేమ్ అపాన్ ఎ లైట్ హౌస్ దాని పేరు. ఇందులో వ్యాపారవేత్త అయిన రతన్ కాకుండా మరో విభిన్న కోణంలో కనిపిస్తారు. శాంతను దృష్టిలో నుంచి మనం రతన్‌ను చూస్తాం. శాంతను ప్రస్తుతం రతన్ టాటా కార్యాలయంలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కొత్త స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టడంపై టాటా గ్రూప్‌కు సలహాలు కూడా ఇస్తున్నారు. అంతేకాదు ముంబయ్‌లోని వెటర్నీరీ ఆసుపత్రి నిర్వహణ కూడా శాంతను చూసుకుంటాడు. 

r3

Advertisment
తాజా కథనాలు