/rtv/media/media_files/2025/01/19/14BbbxdhCPb7xJvso69R.jpg)
Manu Bakar
ఒలింపిక్స్ మెడలిస్ట్, స్టార్ షూటర్ మనుభాకర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మనుభాకర్ అమ్మమ్మ, మేనమామ మృతి చెందారు. హర్యానాలోని మహేంద్రగఢ్ బైపాస్ రోడ్‌లో ఈరోజు ఉదయం 9 గంటలకు వారు ప్రయాణిస్తున్న స్కూటీని కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన మనుభాకర్ అమ్మమ్మ, మేనమామ అక్కడిక్కడే మృతి చెందారు.
Also Read: పిల్లల ముందే బరితెగించిన టీచర్లు.. హగ్గులు, ముద్దులు! వీడియో వైరల్
సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని ఏఎస్‌ఐ సురేష్ కుమార్ తెలిపారు. ప్రమాదం జరిగిన అనంతరం కారు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడని చెప్పారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. రెండు రోజుల క్రితమే మనుభాకర్ రాష్ట్రపతి ద్రౌపది మూర్ము చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే.
Also Read: ఇంటిపై పడిన పేలోడ్ బెలూన్.. భయాందళనలో గ్రామస్థులు
ఇదిలాఉండగా.. 2024లో జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో ఎయిర్ పిస్టల్ విభాగంలో మనుభాకర్ కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే.
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఫైనల్లో ఆడిన ఆమె.. 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్‌లో మహిళా పిస్టల్ షూటింగ్ విభాగంలో పతకం సాధించిన మొదటి మహిళగా మను భాకర్ రికార్డు సృష్టించింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆమె ఖేల్ రత్న అవార్డును అందుకున్నారు. ఇలాంటి సంతోషకరమైన సమయంలో ఆమె అమ్మమ్మ, మేనమామ మృతి చెందడం కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో ఆమె కుటుంబ సభ్యులకు నెటిజెన్లు సానుభూతి తెలియజేస్తున్నారు.