Rajasthan: పిల్లల ముందే బరితెగించిన టీచర్లు.. హగ్గులు, ముద్దులు! వీడియో వైరల్

రాజస్థాన్‌లోని సలేరు గవర్నమెంట్ స్కూల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థుల ముందే టీచర్లు ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు. CCTVలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో ఉన్నతాధికారులు టీచర్లను సస్పెండ్ చేశారు.

New Update

Rajasthan:రాజస్థాన్ లోని గవర్నమెంట్‌ స్కూల్లో టీచర్లు పిల్లల ముందే పాడుపనికి తెగబడ్డారు. ఆఫీస్ రూమ్ లో  ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఇద్దరినీ సస్పెండ్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు  ఛీఛీ పిల్లలకు చదువు చెప్పే పాఠశాలలో ఇలాంటి పాడు పనులు చేయడానికి కనీసం బుద్ది లేదు అంటూ టీచర్ల పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆదర్శంగా ఉండాల్సిన టీచర్లు ఇలాంటి పనులు చేస్తే..  వాళ్ళ నుంచి పిల్లలు ఏం నేర్చుకుంటారు అంటూ ప్రశ్నిస్తున్నారు. 

Also Read:  Parenting Tips: తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తే.. పిల్లలను ఆరోగ్యం కాపాడుకోవడం కష్టం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు