Delhi Blast : ఉగ్ర నియామకాల్లో కొత్త ట్విస్ట్‌..నేర చరిత్ర లేని వారికి ప్రాధాన్యం

ఉగ్రవాదులు కొత్త తరహా ఎత్తుగడలకు తెరతీస్తున్నారు. పోలీసులు, దర్యాప్తు సంస్థల నిఘానుంచి తప్పించుకుని తమ కుట్రలను అమలు పరిచేందుకు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. నేరచరిత్ర లేని వారు, వేర్పాటువాదులతో సంబంధంలేని వారిని రిక్యూట్ చేసుకుంటున్నారు.

New Update
FotoJet - 2025-11-17T081308.995

New twist in terror recruitment

Delhi Blast : ఉగ్రవాదులు కొత్త తరహా ఎత్తుగడలకు తెరతీస్తున్నారు.పోలీసులు, దర్యాప్తు సంస్థల నిఘా నుంచి తప్పించుకుని తమ కుట్రలను అమలుపరిచేందుకు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. దానికోసం నేర చరిత్ర లేని వాళ్లు, వేర్పాటువాదులతో సంబంధంలేని యువకులు, పోలీసులు/దర్యాప్తు సంస్థల నిఘాలో లేని వారిని తమ టార్గెట్‌గా ఎంచుకుని వారిని తమ ముఠాల్లోకి చేర్చుకోవడంతో పాటు వారికి గుట్టుచప్పుడు కాకుండా శిక్షణ ఇస్తున్నారు. గతంలో అనుసరించిన వ్యూహలకు ఇది పూర్తి భిన్నం. గత 20 ఏళ్లుగా ఉగ్రముఠాలు అనుసరిస్తున్న వ్యూహలను మార్చి కొత్త ఎత్తుగడను ఎంచుకుంటున్నారు.

ఎర్రకోట వద్ద జరిగిన పేలుడుపై జరుగుతున్న దర్యాప్తులో ఈ కొత్త కోణం వెలుగు చూసింది. ఈ కేసులో నిందితులైన డాక్టర్‌ అదీల్‌ రాథర్, అతని సోదరుడు డాక్టర్‌ ముజఫర్‌ రాథర్, డాక్టర్‌ ముజమ్మిల్‌ గనాయీలకు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేకపోవడం గమనార్హం. అంతేకాదు వారి కుటుంబ సభ్యుల్లోనూ ఎవరూ పోలీసుల రికార్డుల్లో లేరు అని నిఘా వర్గాలు గుర్తించాయి.  దీన్ని బట్టి పోలీసులు, నిఘా వర్గాల దృష్టిలో పడని ఉన్నత విద్యావంతులను సీమాంతర ఉగ్రముఠాలతో పాటు జమ్మూకశ్మీర్‌ కేంద్రంగా పనిచేసే ఉగ్రకుట్రదారులూ ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే అల్‌ ఫలా యూనివర్సిటీ వైద్యులను ప్రస్తుత దాడులకు వినియోగించుకున్నారని దర్యాప్తు సంస్థలు వెల్లడిస్తున్నాయి.

ఏడాది పాటు అన్వేషించి..ఆత్మాహుతి 

కాగా, ఉగ్రముఠాలు తమ కుట్ర అమలుకు ఏడాది సమయం తీసుకున్నారు. ముఖ్యంగా ఆహ్మహుతి ఆత్మాహుతి బాంబర్‌ కోసం ఏడాది పాటు అన్వేషించినట్లు తెలిసింది. దక్షిణ కశ్మీర్‌లోని ఖాజీగుండ్‌లో పొలిటికల్‌ సైన్స్‌ చదివిన జాసిర్‌ ఎలియాస్‌ ‘డానిష్‌’ను మొదట దీనికి వినియోగించుకోవాలని అనుకున్నారు.  అయితే పలు కారణాలతో అతడు వెనక్కి తగ్గడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో చేయాలనుకున్న ఆ ప్రణాళిక వాయిదా పడింది. ‘నన్ను ‘జైషే మహమ్మద్‌’ ఉగ్రసంస్థకు సహాయకుడిగా ఉండాలని టెర్రర్‌ మాడ్యూల్‌లోని ఇతర సభ్యులు కోరారు. ఉమర్‌ నబీ మాత్రం నన్ను ఆత్మాహుతి బాంబర్‌గా మారేలా ఒప్పించేందుకు చాలా ప్రయత్నించాడు’’ అని జాసిర్ దర్యాప్తు అధికారులకు వెల్లడించినట్లు చెబుతున్నారు.అయితే ఎవరూ ఆత్మహుతికి ముందుకు రాకపోవడంతో శిక్షణ తర్వాత ఉమర్‌ నబీనే ఆత్మాహుతి బాంబర్‌గా మారి ఢిల్లీలో ఎర్రకోట వద్ద  కారుతో పేలుడుకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Also Read: ఢిల్లీ పేలుళ్లకు 18 గంటల ముందు ఉగ్రవాది ఉమర్ ఎక్కడ ఉన్నాడంటే?

Advertisment
తాజా కథనాలు