India Pakistan War: యుద్ధంపై NSA అజిత్ దోవల్ సంచలన ప్రకటన!

చైనా విదేశాంగ శాఖమంత్రి NSA అజిత్ దోవల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాలు మాట్లాడుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే యుద్ధం భారతదేశం ఎంపిక కాదని అజిత్ దోవల్ అన్నారు. ఉగ్రవాదంపై తాము ఉక్కుపాదం మోపామని చెప్పారు.

New Update
NSA Ajit Doval with China'

గతకొన్ని రోజులుగా పాకిస్తాన్, భారత్ పరస్పర దాడుల తర్వాత శనివారం కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ప్రాంతీయ స్థిరత్వం, శాంతిని కాపాడుకోవడం చైనా విదేశాంగ శాఖమంత్రి కోరారు. 

పహల్గామ్ దాడికి ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని అజిత్ దోవల్ చైనాతో అన్నారు. కానీ పాకిస్తాన్‌తో యుద్దం భారత్ ఎంపిక కాదని ఆయన పునరుద్ఘాటించారు. పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ, శాంతి పునరుద్ధరణకు భారతదేశం కట్టుబడి ఉందని అజిత్ దోవల్ చెప్పుకొచ్చారు. 

పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ చెప్పారు. అన్ని రకాల ఉగ్రవాదాన్ని చైనా గట్టిగా వ్యతిరేకిస్తుందని పునరుద్ఘాటించారు. ఆసియా ఖండంలో శాంతి, స్థిరత్వం కష్టపడి సంపాదించుకున్నవి వాటిని గౌరవించాల్సిన అవసరం ఉందని వాంగ్ అన్నారు. చైనాకు, పాకిస్తాన్‌కి భారత్ పొరుగు దేశమని అన్నారు. రెండు దేశాల చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని హితవుపలికారు చైనా విదేశాంగ మంత్రి. ఇప్పుడున్న పరిస్థితి త్రీవతరం కాకుండా చూసుకోవాలని సూచించారు.

యుద్ధం భారతదేశం ఎంపిక కాదని మీరు చేసిన ప్రకటనను చైనా అభినందిస్తుందని వాంగ్ దోవల్‌తో అన్నారు. రెండు దేశాలు ప్రశాంతంగా ఉంటాయని, సంయమనం పాటిస్తూ.. పరస్పర సంప్రదింపుల ద్వారా శాశ్వత కాల్పుల విరమణ చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దాని ఫలితం రెండు దేశాల ప్రాథమిక ప్రయోజనాలకు, ప్రపంచ సమాజ అంచనాలకు అనుగుణంగా ఉంటుందని చైనా నమ్ముతుందన్నారు.

(china | india pak war | ajith-doval | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు