Mukesh Ambani : ఎంత ఖర్చైనా భరిస్తా.. వారికి ఫ్రీ ట్రీట్మెంట్.. ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన!

పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిలో గాయపడిన వారికి బిలియనీర్ ముఖేష్ అంబానీ ఉచిత చికిత్సను అందిస్తున్నట్లు ప్రకటించారు. ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ సర్ హెచ్ఎన్ ఆసుపత్రిలో ఉచిత చికిత్స అందిస్తామని.. ఎంత ఖర్చైనా భరిస్తామని తెలిపారు

New Update
ambani free

పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిలో గాయపడిన వారికి బిలియనీర్ ముఖేష్ అంబానీ ఉచిత చికిత్సను అందిస్తున్నట్లు ప్రకటించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అంబానీ ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఉగ్రదాడిలో  గాయపడిన వారందరికీ ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ సర్ హెచ్ఎన్ ఆసుపత్రిలో ఉచిత చికిత్స అందిస్తామని ఎంత ఖర్చైనా భరిస్తామని తెలిపారు. ఉగ్రదాడికి మానవాళికే మచ్చు. అది ఏ రూపంలో ఉన్న సహించకూడదన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారికి ముఖేష్ అంబానీ సంతాపం తెలిపారు. ఉగ్రదాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  దేశం తరుపున అంబానీ కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. 

సోషల్ మీడియాలో ప్రకటన

రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ కుటుంబం తరపున ముఖేష్ అంబానీ చేసిన ప్రకటనను సోషల్ మీడియాలో షేర్ చేసింది. “ 2025 ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో అమాయక భారతీయుల మరణాలకు రిలయన్స్ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ నాతో కలిసి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బాధితుల కుటుంబాలకు మా సంతాపాన్ని తెలియజేస్తున్నాము. దాడిలో గాయపడిన వారందరూ త్వరగా పూర్తిగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము. ముంబైలోని మా రిలయన్స్ ఫౌండేషన్ సర్ హెచ్ఎన్ హాస్పిటల్ గాయపడిన వారందరికీ ఉచిత చికిత్సను అందిస్తుంది" అని సందేశంలో ఉంది. ఉగ్రవాదంపై పోరాటంలో భారత ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తానని రిలయన్స్ చైర్మన్ హామీ ఇచ్చారు. 

ఉగ్రవాదం మానవాళికి శత్రువు. దానికి ఎవరూ ఏ విధంగానూ మద్దతు ఇవ్వకూడదు. ఉగ్రవాద ముప్పుపై నిర్ణయాత్మక పోరాటంలో మేము మా ప్రధానమంత్రి, భారత ప్రభుత్వం.మొత్తం దేశంతో పూర్తిగా నిలబడతాము" అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు