MUDA Case : సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్ ..  కర్ణాటక హైకోర్టు నోటీసులు

ముడా కుంభకోణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాప్తు కోరుతూ దాఖలు చేసిన అప్పీల్‌కు సంబంధించి కర్ణాటక హైకోర్టు బుధవారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతితో పాటుగా అనేక మందికి నోటీసులు జారీ చేసింది

New Update
cm Siddaramaiah

cm Siddaramaiah

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాప్తు కోరుతూ దాఖలు చేసిన అప్పీల్‌కు సంబంధించి కర్ణాటక హైకోర్టు బుధవారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతితో పాటుగా అనేక మందికి నోటీసులు జారీ చేసింది. ముడా’ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ కర్ణాటక హైకోర్టులో ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా  మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) తన భార్య పార్వతి బిఎమ్‌కు 14 స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Also  Read :  Smita Sabharwal : HCU భూముల వ్యవహారం.. స్మితా సబర్వాల్‌కు సీఎం రేవంత్‌ సర్కార్ బిగ్‌ షాక్‌

కోట్లాది రూపాయల విలువైన భూములను

మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ భూముల కేటాయింపుల వివాదంలో కోట్లాది రూపాయల విలువైన భూములను తన భార్య పార్వతికి దక్కేలా సీఎం సిద్ధరామయ్య కుట్ర చేశారంటూ సమాచార హక్కు చట్టం కార్యకర్తలు టీజే అబ్రహం, ఎస్పీ ప్రదీప్‌, స్నేహమయి కృష్ణ ఆరోపించారు. సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూర్‌లోని కేసరే గ్రామంలో మూడెకరాల భూమి ఉంది. ఆ భూమి కర్ణాటక ప్రభుత్వం తీసుకొని అంతకన్నా ఎక్కువ విలువైనా భూములను పరిహారం కింద ఇచ్చారని బీజేపీ ఆరోపిస్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి రూ.45 కోట్ల వరకు నష్టం జరిగినట్లు ప్రతిపక్షాలు చెబుతున్నాయి.

పరిహారం కింద 2021లో పార్వతికి దక్షిణ మైసూర్‌లో కీలకమైన విజయనగర్‌లో 38,238 చదరపు అడుగుల ప్లాట్లను ప్రభుత్వం కేటాయించింది. పరిహారం కింద ఇచ్చిన ప్లాట్ల మార్కెట్‌ విలువ కేసరేలో స్వాధీనం చేసుకున్న భూమి విలువకంటే ఎక్కువగా ఉంటుందని బీజేపీ ఆరోపించింది. విచారణ జరిపిన లోకాయుక్తా సిద్ధరామయ్య, అతని కుటుంబం అవినీతికి పాల్పడ్డారనడానికి ఆధారాలు లేవని తేల్చింది. 

Also read : Raj Tarun- Lavanya: రాజ్‌ తరుణ్‌ పేరెంట్స్‌పై లావణ్య దాడి! ఇంటి ముందు రచ్చ రచ్చ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు