Smita Sabharwal : HCU భూముల వ్యవహారం.. స్మితా సబర్వాల్‌కు సీఎం రేవంత్‌ సర్కార్ బిగ్‌ షాక్‌

స్మితా సభర్వాల్ కు పోలీసులు బిగ్ షాకిచ్చారు.  కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఆమెకు నోటీసులు పంపించారు. సోషల్ మీడియాలో కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల అడవి ధ్వంసానికి సంబంధించిన ఓ ఏఐ రూపొందించిన ఫేక్ ఫోటోను ఆమె షేర్ చేశారు.

New Update
snmitha ias

snmitha ias

తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ కు పోలీసులు బిగ్ షాకిచ్చారు.  కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఆమెకు నోటీసులు పంపించారు.  సోషల్ మీడియాలో కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల అడవి ధ్వంసానికి సంబంధించిన ఓ ఏఐ రూపొందించిన ఫేక్ ఫోటోను ఆమె షేర్ చేయడమే ఇందుకు కారణం. 2025 మార్చి 31వ తేదీన  ‘Hi Hyderabad’ అని ఎక్స్ వేదికగా షేర్ చేయబడింది. ఇది మష్రూమ్ రాక్ వద్ద బుల్‌డోజర్లు, వాటిని చూస్తున్న నెమలి, జింక లాంటి జంతువులతో జిబ్లి స్టైల్‌లో రూపొందించబడినదిగా ఉంది. 

ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు ఏఐ వీడియోలు, చిత్రాల ద్వారా సోషల్ మీడియాలో విస్తృతంగా తప్పుడు ప్రచారం చేశారని, వీరి వెనుక ప్రతిపక్ష పార్టీలకు చెందిన పెద్దలు ఉన్నారని ప్రభుత్వానికి నిఘా వర్గాలు నుంచి సమాచారం అందింది. ఈ క్రమంలో ఫేక్ ప్రచారానికి పాల్పడిన ఆయా యూట్యూబ్ చానళ్లు, న్యూస్ వెబ్ సైట్లతో పాటు పలువురు నెటిజన్లకు పోలీసులు నోటీసులు అందిస్తున్నారు. అందులో భాగంగానే ఎక్స్ వేదికగా  స్మితా సబర్వాల్ చేసిన రీ పోస్టుకు గానూ పోలీసులు నోటీసులు అందించారు. 

Also read:   ట్రీట్మెంట్ చేయడానికి వచ్చి ఇదేం పనిరా.. మహిళకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి దారుణం

Advertisment