భారత క్రికెట్ స్టార్ మహేంద్ర సింగ్ ధోనీ ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా బ్రాండి అంబాసిడర్‌గా ఎన్నికయ్యారు. వచ్చే నెలలో అక్కడ అసెంబ్లీ ఎన్నికల జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఝార్ఖండ్ ధోని సొంత రాష్ట్రం కావడంతో ప్రజలపై ప్రభావం చూపే సెలబ్రిటీ సామాజిక బాధ్యత తీసుకోవాలని ఎన్నికల కమిషన్ భావించింది. ఈ నేపథ్యంలోనే ఝార్ఖండ్ ఎన్నికలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రవికుమార్ తెలిపారు.
Also Read: తెలంగాణలో రేపటి నుంచి బీసీ కమిషన్ పర్యటనలు
వాస్తవానికి ఎన్నికల సమయంలో ఓటర్లకు అవగాహన కల్పించడం కోసం ఈసీతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగానే ఓటర్లకు అవగాహన పెంచే కార్యక్రమాల్లో ధోని ఫొటో వాడటంపై ఎలక్షన్ కమిక్షన్ ఆయన్ని సంప్రదించింది. ఓటింగ్ శాతం పెంచేందుకు సామాజిక బాధ్యతగా తన ఫొటోను వినియోగించేందుకు ఎలక్షన్ కమిషన్‌కి ధోని సమ్మతి తెలిపారు.
మరికొన్ని రోజుల్లో ధోనీని అధికారులు నేరుగా కలిసి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లలో చైతన్యం తెచ్చేందుకు ఆయన తరఫున చేయాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తామని రవి కుమార్ అన్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ పేరుతో ఓటర్లలో అవగాహన పెంచే కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగానే కొత్త ఓటర్లలో ఎన్నికలపై అవగాహన తెచ్చేందుకు కృషి చేస్తున్నారు.
Also Read: పండగ వేళ సామాన్యులకు షాక్.. పెరిగిన ధరలు
ఇదిలాఉండగా ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 81 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. నవంబర్ 13, నవంబర్ 20న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. మరోవైపు ధోని న్యూ లుక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఐపీఎల్ 2025లో ధోని ఆడుతారా ? లేదా ? అనే టెన్షన్ నెలకొంది. వచ్చే ఐపీఎల్‌లో సీఎస్‌కేకు ప్రాతినిథ్యం వహించనున్నట్లు తెలుస్తోంది.