Modi Government :
రెండేళ్ల క్రితం మొదలైన రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీని ప్రభావం అంతర్జాతీయ ఎరువుల ధరలకు పెరుగుదలకు దారి తీశాయి. భారత సరఫరా గొలుసుకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో దిగుమతులపై ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. నైట్రోజన్, పొటాషియం, పాస్ఫరస్ వంటి ఎరువులు ఎగుమతి చేసే రష్యా సరఫరా గోలుసుకు సైతం అంతరాయం ఏర్పడింది. దీంతో వాటిని దిగుమతి చేసుకునే భారత్ లాంటి దేశాలకు భారీగా వ్యయం పెరుగుతోంది. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు మోదీ ప్రభుత్వం చర్యలకు దిగింది. ఎరువు ధరల పెరుగుదల నుంచి భారతీయ రైతులని కాపాడేందుకు పలు విధానాలను అమలు చేసింది.
Also Read : బ్యాడ్ న్యూస్..రెండు రోజుల పాటు వైన్ షాపులు..!
కేంద్ర ప్రభుత్వం.. ఫర్టిలైజర్ సబ్సిడీల కోసం 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2.25 లక్షల కోట్లు కేటాయించింది. అంతర్జాతీయ ఎరువు ధరల పెరుగుదల వల్ల భారత రైతులపై ప్రభావం పడకుండా రక్షించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరానికి 1.89 లక్షల కోట్ల సబ్సిడీని కేటాయించింది. బడ్జెట్‌లో పలు ఇతర రంగాలకు కేటాయించాల్సిన నిధులను.. రైతుల సబ్సిడీలు కేటాయించింది. దీంతో ఆయా రంగాల నిధుల పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. రష్యా నుంచి దిగుమతులను పెంచడంతో.. సరఫరా గొలుసు అంతరాయాల తీవ్రతను మోదీ ప్రభుత్వం నియంత్రించగలిగింది.
Also Read : ఏచూరి జాతీయ స్థాయిలో తెలుగు ఎర్రజెండా..
ప్రజలకు అత్యవసర ఉపశమనమిచ్చేందుకు సబ్సిడీలు అవసరమవుతున్న నేపథ్యంలో.. మోదీ ప్రభుత్వం (Modi Government) ప్రపంచ మార్కెట్‌లపై ఆధారపడటాన్ని తగ్గించడంపై కేంద్రం దృష్టిసారించింది. విదేశాల నుంచి దిగుమతులు తగ్గించేందుకు దేశీయ ఫర్టిలైజర్ ఉత్పత్తిని పెంచడం, అధిక ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, సమర్ధవంతమైన సరఫరా గోలుసును నిర్మించేందుకు మౌళిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టడం లాంటి వాటిపై మోదీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
Also Read : వేలాదిగా తరలిరండి.. బీఆర్ఎస్ శ్రేణులకు హరీశ్ రావు పిలుపు