Delhi : ఢిల్లీ మురికివాడలో భారీ అగ్నిప్రమాదం..  గుడిసెలు దగ్ధం

దేశ రాజధాని ఢిల్లీలోని రిఠాలా మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న మురికివాడలో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అనేక గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురాగా, ఈ ఘటనలో ఒక బాలుడికి గాయాలయ్యాయి.

New Update
fire accident

దేశ రాజధాని ఢిల్లీలోని రిఠాలా మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న మురికివాడ(Delhi slum) లో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం(fire accident) సంభవించింది. ఈ ప్రమాదంలో అనేక గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురాగా, ఈ ఘటనలో ఒక బాలుడికి గాయాలయ్యాయి. శుక్రవారం రాత్రి 10:56 గంటల ప్రాంతంలో రిఠాలా మెట్రో స్టేషన్, ఢిల్లీ జల్ బోర్డు భవనం మధ్య ఉన్న బెంగాలీ బస్తీ అనే మురికివాడలో మంటలు చెలరేగినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (DFS)కి సమాచారం అందింది.

Also Read :  PM Modi : నాలుగు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ!

గాయపడిన బాలుడిని అంబులెన్స్

దట్టంగా ఇరుకుగా ఉన్న గుడిసెలు, తాత్కాలిక నిర్మాణాల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదాన్ని అధికారులు మీడియం కేటగిరీ ఫైర్‌గా ప్రకటించారు. సమాచారం అందిన వెంటనే, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మొత్తం 29 ఫైర్ టెండర్లను ఉపయోగించి సుమారు గంటల పాటు శ్రమించిన తర్వాత మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్తీలో నివసిస్తున్న ఓ బాలుడికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. గాయపడిన బాలుడిని అంబులెన్స్ ద్వారా వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Also Read :  మావోయిస్టు అగ్రనేతలే టార్గెట్ గా ఆఫరేషన్ ఫైనల్...అడవుల్లోకి 1000 మంది కమాండోలు

ప్రస్తుతం ఆ బాలుడికి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం, మురికివాడలోని గుడిసెలలో ఉన్న అనేక LPG సిలిండర్లు పేలడం వల్ల మంటలు మరింత తీవ్రమయ్యాయి. దీంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు తమ వస్తువులను రక్షించుకోవడానికి పరుగులు తీశారు.అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై దర్యాప్తు జరుగుతోందని, ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ లేదా గ్యాస్ లీక్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఆస్తి నష్టం భారీగా సంభవించినట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు