Encounter: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. నారాయణ్‌పూర్ జిల్లా అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పుల్లో డిఆర్‌జీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: చలికాలంలో వచ్చే వ్యాధులకు ఈ చిన్న ముక్కతో చెక్
భారీగా ఆయుధాలు స్వాధీనం:
బ్రేకింగ్..ఛత్తీస్ ఘడ్
— RTV (@RTVnewsnetwork) January 5, 2025
నారాయణ్ పూర్..జిల్లా..
అబూజ్ మాడ్ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా కొనసాగుతున్న ఎదురు కాల్పులు
నలుగురు మావోయిస్ట్ లు మృతి
ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
కొనసాగుతున్న ఎదురు కాల్పులు
ఎదురుకాల్పుల్లో డి… pic.twitter.com/Ikuq9kEOPX
ఇది కూడా చదవండి: చలికాలంలో తక్కువ నీరు తాగుతున్నారా..? డీహైడ్రేషన్ లక్షణాలు ఇవే
దంతేవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న అబూజ్మడ్ అడవుల్లో శనివారం సాయంత్రం పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సమయంలో మావోయిస్టులు భద్రతాబలగాలకు ఎదురుపడ్డారు. దీంతో ఇద్దరి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఘటనా స్థలం నుంచి ఏకే 47తోపాటు ఎస్ఎల్ఆర్ వంటి ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: రాత్రి స్వెట్టర్ వేసుకుని నిద్రపోతే ఈ సమస్యలు తప్పవు
ఎదురుకాల్పుల్లో మృతి చెందిన కానిస్టేబుల్‌ను దంతెవాడ డీఆర్జీ హెడ్ కానిస్టేబుల్ సన్ను కరమ్‌గా అధికారులు గుర్తించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవలి కాలంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎక్కువ ఎదురుకాల్పుల ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో నక్సలైట్లు ఎక్కువ ప్రాణనష్టం జరుగుతోంది. పోలీసులు జవాన్లను కోల్పోతున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో కలకలం..ఇద్దరు బాలికలు మిస్సింగ్