Explosives Found: భారీ ఉగ్ర కుట్ర భగ్నం..2,900 కేజీల పేలుడు పదార్ధాలు స్వాధీనం

ఢిల్లీ కారు బాంబు పేలుడు తర్వా మరో ఉగ్ర కుట్రను భగ్నం చేశారు జమ్మూ-కాశ్మీర్ పోలీసులు. హరియాణాలో ఫరీదాబాద్ లో ముగ్గురు డాక్టర్లతో పాటూ 2,900 కేజీల పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు.

New Update
doctors

ఢిల్లీతో పాటూ మరి కొన్ని చోట్ల బాంబులు పేల్చేందుకు ఉగ్రవాదులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఢిల్లీ పేలుడు తర్వాత జమ్మూ-కాశ్మీర్ పోలీసులు అప్రత్తంఅవండంతో మితా వాటిని జరగకుండా ఆపగలిగారు. ఈ క్రమంలో నిషేధిత జైషే మహ్మద్, అన్సార్‌ గజ్‌వత్‌ ఉల్‌ హింద్‌ ఉగ్రసంస్థలతో సంబంధం ఉన్న 8 మందిని అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు డాక్టర్లు ఉన్నారు. అదీల్‌ అహ్మద్, ముజమ్మిల్షకీల్, షాహిన్‌ ల దగ్గర నుంచి పలుడుకు సంబంధించిన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఒకరు మహిళ కావడం గమనార్హం. హరియాణాలోని ఫరీదాబాద్ లో పేలుడికిసబంధించి అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్‌ సహా సల్ఫర్‌తో కూడిన పేలుడు పదార్థాలు భారీ ఎత్తున పోగుచేశారు. ఇది దాదాపు 3 వేల కేజీలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

డాక్టర్లు అయితే ఎవరికీ అనుమానం రాదని..

పేలుడు పదార్ధాలతో పాటూ ఎలక్ట్రానిక్‌ పరికరాలు, కొన్ని పత్రాలు, భారీగా మందుగుండు సామగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు జమ్మూ-కాశ్మీర్ పోలీసులు. ప్రస్తుతం డాక్టర్‌ అదీల్, డా.ముజమ్మిల్‌ విచారణలో ఉన్నారు. ఈ పేలుడు పదార్థాలతో ఎక్కడెక్కడ విధ్వంసం సృష్టించాలి అన్న వివరాలను పెడ్లర్ల నుంచి పొందడం కోసం ఎదురు చూస్తున్నట్లు వారు చెప్పారు. డాక్టర్లు అయితే ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో పెడ్లర్లు తమను ఎంచుకున్నారని వివరించారు. అలాగే తాము ఉగ్రవాదం వైపు మళ్లడానికి కారణం ఓ మసీదుకు చెందిన ఇమామ్‌ ఇర్ఫాన్‌ అహ్మద్‌ కారణమని తెలిపారు. శ్రీనగర్‌లో అక్టోబరు 19న బుణ్‌పోరనౌగమ్‌లోని పలు చోట్ల పోలీసులు, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని జైషే మహమ్మద్‌ పోస్టర్లు వెలిశాయి. ఈ ఘటనలో సీసీ టీవీ కెమెరాల ఆధారంగా ఈ డాక్టర్లను పట్టుకున్నారు. జమ్మూకశ్మీర్పుల్వామాకు చెందిన వైద్యుడు ముజమ్మిల్షకీల్హరియాణాలోని ఫరీదాబాద్‌లో అద్దెకు తీసుకున్న రెండు ఇళ్ళ నుంచి భద్రతాసిబ్బంది పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒక ఇంటి యజమాని మౌలానా అని అతను ఫరీదాబాద్ లోని ధోజ్‌లో గల అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీలో షకీల్‌ అధ్యాపకుడిగా పని చేస్తున్నాడని తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు