Ladakh : లడఖ్‌లో ఆందోళనలు.. నలుగురి మృతి

లడఖ్‌ రాజధాని లేహ్‌లో నిరసనకారులు రెచ్చిపోయారు. ఇక్కడి బీజేపీ కార్యలాయానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని 6షెడ్యూల్‌లో చేర్చాలని, స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు ఇవ్వాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

author-image
By Krishna
New Update
ladkh

రెచ్చిపోయిన నిరసనకారులు..బీజేపీ ఆఫీసుకు నిప్పు పెట్టారు! లడఖ్‌ రాజధాని లేహ్‌లో నిరసనకారులు రెచ్చిపోయారు. ఇక్కడి బీజేపీ కార్యలాయానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చాలని, స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు ఇవ్వాలని నిరసనకారులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పలు మార్లు చర్చలు, నిరసనలు జరిగాయి. కానీ ఇటీవల జరిగిన నిరసనలలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కోపంతో ఉన్న నిరసనకారులు పోలీసులతో ఘర్షణ పడ్డారు, అధికారులపై రాళ్లు రువ్వారు. అంతేకాకుండా పోలీసు వాహనాన్ని కూడా తగలబెట్టారు, రాష్ట్ర సాధన ఉద్యమంలో జరిగిన మొదటి హింస ఇది..

ఈ హింసత్మక ఘటనలో  నలుగురు మరణించగా, 70 మందికి పైగా గాయపడ్డారు. హింసను అదుపు చేయడానికి పోలీసులు నిరసనకారులపై భాష్పవాయువు, లాఠీచార్జి చేశారు. దీంతో అక్కడి అధికారులు అలెర్ట్ అయ్యారు. నగరంలో కర్ఫ్యూ విధించారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు సమావేశమవ్వడాన్ని నిషేధించారు.  ముందస్తు లిఖిత అనుమతి లేకుండా ఎటువంటి ఊరేగింపు, ర్యాలీ, కవాతు నిర్వహించరాదని అధికారిక ఉత్తర్వులో పేర్కొన్నారు.

 లడఖ్‌లో ఇలాంటి ఘర్షణలు జరగడం ఇదే తొలిసారి. ప్రభుత్వంతో త్వరలో చర్చలు జరగనున్న నేపథ్యంలో హింస చెలరేగింది. లడఖ్ ప్రజల డిమాండ్లపై చర్చలను తిరిగి ప్రారంభించడానికి అక్టోబర్ 6న లడఖ్ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రం పిలుపునిచ్చింది.గత రెండు వారాలుగా కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ లడఖ్‌కు రాష్ట్ర హోదా,  రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ కింద ఆ ప్రాంతాన్ని చేర్చాలని కోరుతూ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు,  జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజన తర్వాత, 2019 ఆగస్టులో లడఖ్‌ను ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా విభజించారు.

Also Read : Flipkart Offers: అమ్మతోడు.. ఆఫర్ అదిరింది భయ్యా.. రూ. 32 వేల మూడు డోర్ల ఫ్రిజ్ కేవలం రూ.10 వేలకే!

నిరసనకారుల ప్రధాన డిమాండ్లు:

  • లడఖ్ కు పూర్తి రాష్ట్ర హోదా కల్పించడం.
  • రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ కింద లడఖ్ ను చేర్చడం. దీనివల్ల స్థానిక భూమి, సంస్కృతి,  ఉపాధి అవకాశాలకు రక్షణ లభిస్తుంది.
  • స్థానికులకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు.
  • లడఖ్, కార్గిల్ జిల్లాలకు ఒక్కో పార్లమెంటరీ సీటు కేటాయించడం

Also Read : OG Premieres: సుజీత్, అకీరా నందన్ 'OG' ప్రీమియర్ షో చూసేది ఈ థియేటర్ లోనే..

Advertisment
తాజా కథనాలు