Keshava Rao Encounter: నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్.. ఆయన ఆఖరి క్షణాల్లో జరిగింది ఇదేనా?

మావోయిస్టు నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అనారోగ్యంతో చికిత్స తీసుకుంటుండగా పట్టుకుని కాల్చి చంపారని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆయనకు 50 మంది రక్షణగా ఉంటే కేవలం 26 మందినే చూపించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 

New Update
kesava rao

Maoist Kesava Rao encounter public Sensational allegations

Keshava Rao Encounter: మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అనారోగ్యంతో చికిత్స తీసుకుంటుండగా పట్టుకుని కాల్చి చంపారని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. 50 మంది రక్షణగా ఉంటే కేవలం 26 మందినే చూపించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 

ఫేక్ ఎన్‌కౌంటర్‌..

ఛత్తీస్‌గఢ్‌ అబూజ్‌మడ్‌ అడవుల్లో మే 21న ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కేశవరావుతో పాటు మరో 26 మంది చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఇది ఫేక్ ఎన్‌కౌంటర్‌ అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ఇంతవరకు ఈ ఎన్ కౌంటర్ ఏ ప్రాంతంలో జరిగిందనేది చెప్పడం లేదని, మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించకపోవడంపై ప్రజా సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.  ఇక కేశవరావుకు చుట్టూ కనీసం 50 మంది రక్షణగా ఉంటారని, 26 మందినే చూపించడంపై సందేహాలున్నాయంటున్నారు. 

మార్ఫింగ్ ఫొటోలు..

ముఖ్యంగా పోలీసులు విడుదల చేసిన కేశవరావు ఫొటోపై లక్షణాలు తేడాగా ఉన్నాయంటున్నారు. ఆయన గడ్డం చేసుకోవడం, తల జుట్టుకు రంగు వేసుకోవడం, మెడలపై ఎర్రదస్తీ ఉండడం అనుమానాలకు తావిస్తుందంటున్నారు. నిజానికి కేశవరావు దస్తీ వాడరని, ఆయన మృతదేహం పడుకోబెట్టిన ప్రదేశం ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలా లేదంటున్నారు. మిగతా మావోయిస్టుల ఫొటోలు చూస్తుంటే చాలా దగ్గర నుంచి కాల్చివేసినట్లు స్పష్టంగా అర్థం అవుతుందంటున్నారు. ముఖాలపై తుపాకీతో గాయపరిచి, చిత్ర హింసలకు గురిచేసినట్లు గుర్తులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. 

మూడంచెల భద్రతా..

కేశవరావు కదలికల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని, ఆయన చుట్టువున్న వారిలో కనీసం 10 మంది దగ్గర ఏకే 47 తుపాకులు ఉంటాయని చెబుతున్నారు. పోలీసులు 3 తుపాకులే స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించడంపై కూడా అనుమానాలున్నాయని, మిగతా వారు ఏమయ్యారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పదేళ్లుగా అబూజ్‌మడ్‌ అడవుల్లోని ఒకే ప్రాంతంలో ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. వరస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నా ఆయన అక్కడే ఉంటున్నారని, ఇది పసిగట్టిన పోలీసులు ఆయన క్యాంప్‌పై దాడిచేసినట్లు చర్చ జరుగుతోంది. ఆయన అతి విశ్వాసమే ప్రాణాలమీదకు వచ్చిందనే వాదన కూడా ఉంది. 

కోవర్ట్ ఆపరేషన్..

ఇదిలా ఉంటే.. కోవర్ట్ ఆపరేషన్ వల్లే ఈ ఎన్​కౌంటర్​ జరిగిందనే వాదనలున్నాయి. పోలీసు బలగాలు పక్కా స్కెచ్ వేసి ఒడిశాలో హెల్త్​ చెకప్  కోసం వెళ్లిన కేశవరావును హతమార్చినట్లు తెలుస్తోంది. అటవీప్రాంతం నుంచి ఆయన బయటకు వెళ్లడం వల్లనే భద్రతా లేకుండా పోయిందని, కోవర్ట్​లను రంగంలోకి దింపి అటాక్ చేసినట్లు సమాచారం. ఆయనతోపాటు వచ్చిన వారిని మాత్రమే పట్టుకుని కాల్చి చంపారని, ఈ ఎన్ కౌంటర్ ఇంద్రావతి రివర్​ఫారెస్ట్​లో జరిగినట్లు చెబుతున్నారు. 

Nambala kesavarao | chattisaghad | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
తాజా కథనాలు