Manipur: మళ్లీ చెలరేగుతున్న అల్లర్లు.. ముఖ్యమంత్రి ఇంటిపై దాడులు

మైతీ వర్గానికి చెందిన ఆరుగురుని కుకీ తెగ కిడ్నాప్ చేసి చంపడంతో మణిపూర్‌లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మైతీ ప్రజలు డిమాండ్ చేస్తూ.. సీఎం ఎన్ బీరెన్ సింగ్‌తో పాటు పలువురు మంత్రుల ఇంటిపై దాడులు చేపట్టారు.

New Update
Manipur

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మళ్లీ అల్లర్లు చెలరేగుతున్నాయి. గతంలో కుకీ, మైతీ వర్గాల మధ్య అల్లర్లు జరిగాయి. ఇప్పుడు మళ్లీ అవి పెరిగాయి. మైతీ వర్గానికి చెందిన ఆరుగురిని కుకీ వర్గానికి చెందిన మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. ఇంతటితో ఆగకుండా వారిని హత్య చేసి జిరిబం జిల్లాలోని ఓ నది దగ్గర పడేశారు.

ఇది కూడా చూడండి: చైనాలో దారుణం.. కత్తి దాడిలో 8 మంది మృతి

చిన్న పిల్లలు అని చూడకుండా..

ఇందులో ముగ్గురు మహిళలతో పాటు చిన్నారులు కూడా ఉన్నాయి. అందులోనూ 10 నెలల పాప కూడా ఉంది. మహిళలు, చిన్న పిల్లలు అని చూడకుండా ఇంతటి దారుణానికి ఒడికట్టడంతో మణిపూర్ రాజధాని ఇంపాల్‌లో మైతీ వర్గానికి చెందిన వారు ఆందోళనలు చేపట్టడం ప్రారంభించారు. ఇవి తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ క్రమంలో సీఎం ఎన్ బీరెన్ సింగ్ ఇంటిపై ఆందోళన కారులు దాడులు చేయడంతో పాటు ఎమ్మెల్యేలు ఇంటిపై కూడా చేశారు.

ఇది కూడా చూడండి:  ‘నెట్ స్పీడ్ పెరిగిందో మీ పని ఖతం.. బాడీలో ఆ పార్ట్‌కు ముప్పు’

దాడి చేసే సమయంలో బీరెన్ సింగ్ ఇంట్లో లేకపోవడం వల్ల ప్రమాదేమి జరగలేదు. ఈ అల్లర్లు నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం రెండు రోజుల ఇంటర్‌నెట్‌ను బంద్ చేసింది. క్రూరంగా ఆరుగురిని చంపిన నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని, వారిని శిక్షించాలని మైతీ వర్గానికి చెందిన వారు నిరసనలు చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: ప్రెగ్నెంట్ చేస్తే లక్షల్లో డబ్బు అంటూ.. నిరుద్యోగ అబ్బాయిలే టార్గెట్

 

ఇది కూడా చూడండి: TG Group-3: నేడే గ్రూప్-3 పరీక్ష.. అభ్యర్థులకు నిపుణుల కీలక సూచన!

Advertisment
Advertisment
తాజా కథనాలు