మహాయుతి విజయానికి కలిసొచ్చిన ప్రధానాంశాలు ఇవే..

మహారాష్ట్ర ప్రజలు మహా వికాస్ అఘాడి కూటమికి షాక్‌ ఇచ్చారు. మహాయుతి కూటమికే అధికారంలోకి రాబోతుంది. ఇప్పటికే ఈ కూటమి శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. మహాయుతి గెలిచేందుకు కలిసొచ్చిన అంశాలేంటో ఈ ఆర్టికల్‌లో చదవండి.

author-image
By B Aravind
New Update
gg

మహారాష్ట్ర ప్రజలు మహా వికాస్ అఘాడి కూటమికి షాక్‌ ఇచ్చారు. మహాయుతి కూటమికే అధికారంలోకి రాబోతుంది. ఇప్పటికే ఈ కూటమి శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. మహాయుతి మేజిక్ ఫిగర్‌ను దాటి 220 స్థానాల్లో దూసుకుపోతుంది. మహా వికాస్ అఘాడి మాత్రం కేవలం 57 స్థానాల్లోనే అధిక్యంలో కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మహాయుతి కసరత్తులు వేస్తోంది. అయితే మహాయుతి కూటమికి కలిసి వచ్చిన అంశాలెంటో ఇప్పుడు చూద్దాం.  

Also Read: మహా వికాస్ అఘాడి చేసిన ఈ తప్పులే ఓటమికి కారణం..

ముందుగా శివసేన (షిండే వర్గం), ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం), బీజేపీ కలిసి మరికొన్ని పార్టీలను కలుపుకొని మహాయుతి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లింది. అలాగే ఎన్నికల హామీలు, నినాదాలు మహాయుతి కూటమికి కలిసొచ్చాయి. లాడ్లీ బెహనా యోజన పథకం, మహిళలకు రూ.2,100 ఆర్థిక సాయం, పోలీస్ శాఖలోకి 25వేల మంది మహిళల రిక్రూట్మెంట్, రైతులకు రుణమాఫీ, నెలకు రూ.2,100 వృద్ధాప్య పెన్షన్లు, 25 లక్షల మందికి ఉపాధి, 10 లక్షల మంది విద్యార్థులకు నెలకు రూ.10 వేల స్కాలర్ షిప్ అంశాలు కలిసొచ్చాయి.

అలాగే అంగన్వాడి, ఆశా వర్కర్లకు నెలకు రూ.15 వేల జీతం, కరెంటు బిల్లులో 30% రాయితీ , అక్షయ్ అన్న యోజన కింద తక్కువ ఆదాయ వర్గాలకు ప్రతినెల ఉచిత రేషన్ ఇవ్వడం లాంటి అంశాలన్నీ కూడా కలిసొచ్చాయి. కులగణనను వ్యతిరేకిస్తూ మోదీ చేసిన ఏక్‌తో సేఫ్‌ హై నినాదం బాగా పని చేసింది. ఓబీసీలు, ఆదివాసీలను విభజిస్తే నష్టమంటూ చేసిన ప్రచారం కూడా ప్రజల్లోకి వెళ్లింది. 

Also Read: నేనే సీఎం.. షిండే సంచలన ప్రకటన

ఇక ఎట్టకేలకు మహాయుతి కూటమికే మరాఠి ప్రజలు పట్టం కట్టారు. మహా వికాస్ అఘాడి కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్లమెంటు ఎన్నికల్లో మహాయుతి కూటమి కంటే ఎక్కువ సీట్లు ఎంవీఎస్ కూటమికే వచ్చాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఫలితాలు రివర్స్ అయ్యాయి. మహాయుతి కూటమే అధికారాన్ని ఏర్పటుచేయనుంది. అయితే మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్‌ షిండేనే కొనసాగుతారా ? లేదా దేవేంద్ర ఫడ్నవీస్‌కు అవకాశం ఇస్తారా అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

ఇది కూడా చూడండి:  హాయ్ .. హలో అంటూ ఫోన్ కాల్.. కట్ చేస్తే న్యూడ్ వీడియో!

ఇది కూడా చూడండి: మహారాష్ట్రలో 'నితీష్ కుమార్' మోడల్.. సీఎం అభ్యర్థిపై బీజేపీ వ్యూహం ఇదేనా?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు