NCRB సంచలన రిపోర్ట్.. అవినీతిలో ఈ రాష్ట్రం ఫస్ట్

నేషనల్‌ క్రైం రికార్డు బ్యూరో విడుదల చేసిన జాబితా దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే అవినీతిలో మహారాష్ట్ర అగ్రస్ధానంలో ఉందని తేలింది. దేశ వ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,875 అవినీతి కేసులు నమోదు కాగా అందులో మహారాష్ట్రలోనే 795 కేసులు నమోదయ్యాయి.

New Update
list

World Corrupt Countries List

నేషనల్‌ క్రైం రికార్డు బ్యూరో విడుదల చేసిన జాబితా దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే అవినీతిలో మహారాష్ట్ర అగ్రస్ధానంలో ఉందని తేలింది. దేశ వ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,875 అవినీతి కేసులు నమోదు కాగా అందులో మహారాష్ట్రలోనే 795 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఈ ఏడాది అక్టోబర్ 2 వరకు 530 అవినీతి కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనల్లో 785 ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీన్ని బట్టి మహారాష్ట్రలో 28 శాతం అవినీతి కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. 

సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ముడుపులు చెల్లించనిదే సామాన్యుల పనులు జరగవనేది జగమెరిగిన సత్యం. దీంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల గోడలపై అంచం తీసుకోవడం నేరం– ఇవ్వడం కూడా నేరమే అవుతుందని పెద్దపెద్ద అక్షరాలతో రాసిన దృశ్యాలు కనిపిస్తాయి. ఈ విషయం అందరికి తెలిసినా పనుల కోసం లంచం చెల్లించడం పరిపాటిగా మారింది. మరికొందరు అడిగినంత ఆమ్యామ్యా ఇవ్వలేక, అవినీతిని ప్రొత్సహించలేక అవినీతి నిరోదక శాఖ (ఏసీబీ) అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.

ఈ నివేదిక ప్రకారం ఈ ఏడాది మహారాష్ట్రలో 795 కేసులు నమోదుకాగా ఆ తరువాత స్ధానంలో రాజస్ధాన్‌ (284), మూడో స్ధానంలో కర్ణాటక (245), నాలుగో స్ధానంలో గుజరాత్‌ (183) ఉన్నాయి. అయితే మహారాష్ట్రలోని వివిధ నగరాలు, జిల్లాల వారీగా పరిశీలిస్తే ముంబై, థానే సహా నాసిక్, పుణే, ఛత్రపతి సంభాజీనగర్‌ అవినీతిలో టాప్‌లో ఉన్నాయి.  

ఈశాన్య భారతంలో ఉన్న ఎనిమిది రాష్ట్రాలలో అస్సాం, సిక్కిం (Sikkim) మినహా అరుణాచల్‌ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, త్రిపుర, నాగాలాండ్‌లలో ఒక్క అవినీతి కేసు నమోదు కాలేదు. కాగా అస్సాంలో 91, సిక్కింలో కేవలం ఒక్కటే అవినీతి కేసు నమోదైనట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది.

Advertisment
తాజా కథనాలు