/rtv/media/media_files/2025/05/28/Zs8fUQ00k0Mweu6fb4pi.jpg)
Maharashtra Crime News
Crime News: మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా చైల్డ్ షెల్టర్ హోమ్‌లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఔసా తాలూకాలోని హసేగావ్‌లో ఉన్న సేవాలయ్ అనే షెల్టర్ హోమ్‌లో హెచ్‌ఐవి ఉన్న ఓ మైనర్ బాలికపై రెండేళ్లపాటు అతి క్రూరంగా అత్యాచారంచేశారు కామాంధులు. 2023 జూలై 13 నుంచి 2025 జూలై 23 వరకు బాలికపై పదే పదే లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు అమిత్ మహాముని అనే షెల్టర్ ఉద్యోగి. అతడు కేవలం అత్యాచారమే కాకుండా ఈ దారుణం బయటపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బాలికను బెదిరించాడు.
మైనర్‌పై లైంగిక దాడి..
ధైర్యం చేసి ఒకరోజు బాలిక తన బాధను షెల్టర్ హోమ్ అధికారులకు లేఖ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నించింది. అయితే బాధితురాలిని రక్షించాల్సిన యాజమాన్యం ఆ లేఖను చింపి నిర్లక్ష్యం చేసింది. పరిస్థితి మరింత దిగజారింది. బాలిక ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు ఆమె నాలుగు నెలల గర్భవతి అని వైద్యులు వెల్లడించారు. ఈ విషయంతో ఆశ్రమంలోని దుర్మార్గాలు వెలుగులోకి వచ్చాయి. అయితే బాలిక గర్భం అనుమతి లేకుండా బలవంతంగా తొలగించారు. దీనిని పూజా వాఘ్మారే అనే వైద్యురాలు నిర్వహించగా.. ఈ చర్యకు ఆమెను అరెస్టు చేశారు. బాలిక చివరికి ధైర్యం చేసి ధరశివ్ జిల్లాలోని ధోకి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఇది కూడా చదవండి: వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. విద్యుత్ షాక్‌కు చికిత్స అందించే విధానం ఇదే
పోలీసులు వెంటనే స్పందించి సేవాలయ్ వ్యవస్థాపకుడు రవి బాపట్లే, సూపరింటెండెంట్ రచనా బాపట్లే, ప్రధాన నిందితుడు అమిత్ మహాముని, గర్భస్రావం చేసిన వైద్యురాలు పూజా వాఘ్మారేని అరెస్టు చేశారు. ఈ కేసును ఔసా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు లాతూర్ జిల్లా ఎస్పీ అమోల్ తంబే తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఇకపై ఇలాంటి దారుణానికి గురికాకూడదన్న సంకల్పంతో పోలీసులు ఇతర బాలికలతోనూ విచారణ చేశారు. మైనర్లకు రక్షణ కల్పించాల్సిన కేంద్రాల్లో ఇలాంటి ఘోరాలు జరగడం దారుణం స్థానికులు మండిపడుతున్నారు.
ఇది కూడా చదవండి: అయ్యో యామిని.. ఎంత పని చేశావమ్మా.. ఖమ్మంలో కన్నీరు పెట్టించే ఘటన!
( Latest News)