మహారాష్ట్ర సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఆయనకే మొగ్గు!

మహారాష్ట్ర సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మూడు పార్టీలు కలిసి ఘన విజయం సాధించడంతో ఏ పార్టీకి సీఎం కుర్చీ దక్కుతుందనేది చర్చనీయాంశమైంది. ఏక్ నాథ్ షిండే, ఫడ్నవిస్, అజిత్ పవార్ పోటీలోనే ఉన్నామని భావిస్తుండటంపై ఆసక్తి నెలకొంది.

author-image
By srinivas
teter
New Update

Maharastra: మహారాష్ట్ర సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మూడు పార్టీలు కలిసి ఘన విజయం సాధించడంతో ఏ పార్టీకి సీఎం కుర్చీ దక్కుతుందనేది చర్చనీయాంశమైంది. ఏక్ నాథ్ షిండే, ఫడ్నవిస్, అజిత్ పవార్ పోటీలోనే ఉన్నామని భావించడంపై ఆసక్తి నెలకొంది. 

ముగ్గురు సిద్ధంగానే.. 

ఈ మేరకు సీఎం ఎవరనే అంశంపై స్పందించిన ఏక్ నాథ్ షిండే.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా నిర్ణయం తీసుకుంటారన్నారు. మరో వైపు తానూ ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్టు అజిత్ పవార్ చెబుతున్నారు. ఇక అందరం సమిష్టిగా ఉంటేనే మరింత బలంగా ఉంటామని దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. బీజేపీ నేతలు మాత్రం దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి అవుతారని, ఆయనవైపే అధిష్టానం మొగ్గుచూపుతుందని ఆశిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: Nagababu : ప్రతి హీరో నాయకుడు కాలేడు.. పవన్ పై నాగబాబు సంచలన ట్వీట్

మరోవైపు ఫడ్నవీస్ సీఎం అవుతారని బీజేపీ నాయకుడు ప్రవీణ్‌ ధరేకర్‌ అంటున్నారు. ఇప్పటికే సీఎం పదవిపై మహాయుతి కూటమిలోని మిత్రపక్షాలైన శిందే నేతృత్వంలోని శివసేన, ఎన్‌సీపీ అజిత్‌ పవార్‌ వర్గంతో బీజేపీ పెద్దలు చర్చలు జరపుతున్నట్లు తెలుస్తోంది. ఇక కూటమిలోని మూడు ప్రధాన పార్టీల అభిప్రాయంతోనే సీఎంపై నిర్ణయం తీసుకుంటాయని ఫడ్నవీస్ చెప్పారు. ఇందులో ఎలాంటి వివాదం లేదని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: ఎట్టకేలకు బయటపడ్డన విజయ్ - రష్మిక సీక్రెట్ రిలేషన్.. ఒక్క ఫొటోతో క్లారిటీ

మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా అసెంబ్లీ గడువు ఈ నెల 26తో ముగియనుంది. దీంతో గెలిచిన కూటమి 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. లేదంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశముంది.  

 

#maharastra #ajith-pawar #shinde #devendra fadnavis
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe