/rtv/media/media_files/2024/10/30/7giMuQNCo1VxYfkLjGXG.jpg)
Madhya Pradesh: మనస్పర్థలు, గొడవలతో భర్తను వదిలేసిన భార్యలు చూసుంటారు. కానీ ఊళ్ళో నీటి కరువు కారణంగా భర్తను వదిలేసి పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది ఓ ఇల్లాలు. ''భవిష్యత్తులేని ఆ గ్రామంలో ఉంటే తన పిల్లలు ఏం బాగుపడతారని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని దేవ్ర గ్రామంలో వెలుగుచూసింది.
Also Read: Shanmukha OTT: ఓటీటీలోకి సడెన్ ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్ 'షణ్ముఖ'.. ఎక్కడ చూడొచ్చంటే..?
నీటి కరువు
అయితే దేవ్ర గ్రామంలో జితేంద్ర అనే వ్యక్తి రోజువారీ కూలీగా జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. కాగా, ఈ గ్రామంలో ప్రజలు నీటి కరువుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఊరు అంతటా కలిపి ఒకే ఒక్క బోరు బావి ఉండగా.. రోజంతా గ్రామస్థులు నీటి కోసం దాని ముందు క్యూ కట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం ఓ ట్యాంక్ నిర్మించినప్పటికీ దానికి నీటి సరఫరా ఏర్పాట్లు లేవు
Also Read : kannappa: ఇట్స్ అఫీషియల్.. ‘కన్నప్ప’ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మంచు విష్ణు.. ఎప్పుడంటే?
Wife abandons man over water crisis in MP village; pipeline work starts after his complainthttps://t.co/rbmvRYeZgF#Dhindori #MadhyaPradesh #Water #CleanWater #DrinkingWater #Relationship pic.twitter.com/DaakWbOrld
— NewsDrum (@thenewsdrum) April 9, 2025
నీటి కరువుతో భర్తను వదిలేసి..
ఈ పరిస్థితులతో విసిగిపోయిన జితేందర్ భార్య పిల్లలను తీసుకొని పుట్టింటింది వెళ్ళిపోయింది. దీంతో జితేందర్ జిల్లా అధికారుల దగ్గరికి వెళ్లి తన బాధను చెప్పుకున్నాడు. ''భవిష్యత్తులేని గ్రామంలో నా పిల్లలు ఏం బాగుపడతారని తన భార్య నిలదీసిందని'' వాపోయాడు. దీనిపై స్పందించిన అధికారులు వెంటనే గ్రామానికి మంచి నీటి సౌకర్యం కల్పించాలని పీహెచ్‌ఈ ఆదేశించారు.