Madhya Pradesh Crime News
Crime News: ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాలు కాపురాలను నాశనం చేయటంతోపాటు మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటుంది. కామ కోరికల కోసం పచ్చని కాపురంలోకి వచ్చి చిచ్చుపెట్టి జీవితాలను పాడు చేస్తున్నారు. వాళ్ల కామాం కోసం పసి పిల్లలు కూడా మరణించాల్సి వస్తుంది. తాజాగా అలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) చోటు చేస్తుంది. ఈ వివాహేతర సంబంధం (extramarital affair) ఒకే కుటుంబంలోని నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్య వివాహేతర సంబంధం కారణంగా భర్త తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పిడ సంఘటన ని సాగర్ జిల్లా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సాగర్ జిల్లాకు చెందిన మనోహర్ లోధి, ద్రౌపది దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కూతురు, కొడుకు ఉన్నారు. వీరి సంసారం సాఫీగానే సాగుతోందని అందరూ అనుకున్నారు. అయితే ద్రౌపదికి (Draupadi) తన భర్త మనోహర్ చిన్ననాటి స్నేహితుడైన (childhood friend) సురేంద్రతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంబంధం రోజురోజుకూ బలపడుతూ వచ్చింది.
భర్తకంటే తన ప్రియుడే ముఖ్యమని చెప్పి..
ఈ క్రమంలో ఓ రోజు మనోహర్ కూతురు తన తల్లి ద్రౌపదిని.. సురేంద్రను (Surendra) అభ్యంతరకర స్థితిలో చూసింది. ఈ విషయం మనోహర్‌కు తెలియడంతో అతను తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తన భార్య ద్రౌపదిని, సురేంద్రను పద్ధతి మార్చుకోవాలని.. ఈ సంబంధాన్ని తెంచుకోవాలని చాలాసార్లు వేడుకున్నాడు. కానీ ద్రౌపది తన భర్త మాటలను పెడచెవిన పెట్టింది. అంతేకాకుండా.. మనోహర్‌పై వరకట్న వేధింపుల (Dowry harassment) కేసు పెడతానని బెదిరించింది. తన భర్తకంటే తన ప్రియుడే (boyfriend) ముఖ్యమని చెప్పి.. సురేంద్రతో కలిసి వెళ్లిపోయింది. ఈ పరిణామంతో మనోహర్ పూర్తిగా కుంగిపోయాడు. తన భార్య తనను, కుటుంబాన్ని వదిలి ప్రియుడితో వెళ్లిపోవడం, దానికి తోడు వరకట్నం కేసు బెదిరింపులు అతనిని తీవ్ర నిరాశలోకి నెట్టినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో కసాయి భర్త.. ప్రియురాలి కోసం భార్య, పిల్లల్ని ఏం చేశాడంటే!
దీంతో జూలై 25వ తేదీ రాత్రి మనోహర్, అతని తల్లి, కూతురు, కొడుకు విషాదకరంగా బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల లోతైన దర్యాప్తులో ద్రౌపది, సురేంద్రల వివాహేతర సంబంధమే ఈ ఘోరానికి కారణమని వెల్లడైంది. పోలీసులు (police) వెంటనే ద్రౌపది, సురేంద్రలపై కేసు (case) నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. ఈ ఘటన సాగర్ జిల్లాలో (Sagar District) చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సంబంధాల పట్ల అజాగ్రత్త, వివాహేతర సంబంధాలు నలుగురు ప్రాణాలను బలి తీసుకున్న వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు స్పాట్‌డెడ్
( Latest News)