/rtv/media/media_files/2025/08/03/ka-paul-2025-08-03-17-16-30.jpg)
ఢిల్లీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై కిడ్నాప్ యత్నం జరిగింది. బెట్టింగ్ యాప్ కేసులో సుప్రీంకోర్టు విచారణకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగినట్లుగా ఈ ఘటన జరిగినట్లుగా పాల్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. తనను ఏడుగురు కిడ్నాపర్లు చుట్టుముట్టారని తెలిపారు. దుండగులు ఆటోలు, కార్లతో వెంబడించారని, వారి నుంచి తాను తప్పించుకున్నానని వెల్లడించారు. తనపై కిడ్నాప్ అటెంప్ట్ జరిగిందంటూ ఢిల్లీ పోలీసులకు కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. దీనిపై తాను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు కూడా లేఖ రాశానని కేఏ పాల్ తన వీడియోలో వెల్లడించారు. ఢిల్లీ పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఢిల్లీలో కేఏ పాల్‌పై కిడ్నాప్ యత్నం.. పాల్ని చుట్టుముట్టిన ఏడుగురు కిడ్నాపర్లు.. ఆటోలు, కార్లతో వెంబడించిన దుండగులు.. కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న పాల్.@KAPaulOfficial#Delhi#kapaul#kidnap#viralvideo#RTVpic.twitter.com/nAl68Ksbg9
— RTV (@RTVnewsnetwork) August 3, 2025
బెట్టింగ్ యాప్‌లపై నిషేధం విధించాలని
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు కేఏ పాల్. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల వల్ల యువత జీవితాలు నాశనమవుతున్నాయని, ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఒక్క తెలంగాణలోనే 1,000 మందికి పైగా యువత ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. నిమా నటులు, క్రికెటర్లు, ఇతర సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసి యువతను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. బెట్టింగ్ యాప్‌లను తక్షణమే నిషేధించాలని, ఈ యాప్‌లను ప్రచారం చేస్తున్న సెలబ్రిటీలపై చర్యలు తీసుకోవాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు.
Also Read : Bigg Boss Soniya: బిగ్ బాస్ సోనియా సీమంతంలో బుల్లితెర నటులు .. ఫొటోలు చూశారా
నిమిష ప్రియ కేసులో కేఏ పాల్ జోక్యం
యెమెన్‌లో మరణశిక్ష పడిన కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో కేఏ పాల్ క్రియాశీలకంగా జోక్యం చేసుకున్నారు. ఆమె విడుదల కోసం తాను కృషి చేస్తున్నానని పలుమార్లు ఆయన ప్రకటించారు. మృతుడి కుటుంబంతో చర్చలు జరిపి నిమిష ప్రియను విడుదల చేయడానికి అంగీకారం కుదిర్చానని, మరో నాలుగు రోజుల్లో ఆమెను ఇండియాకు తీసుకువస్తానని కూడా కేఏ పాల్ ప్రకటించారు. ఈ విషయంపై ఆయన ప్రధాని మోదీకి ధన్యవాదాలు కూడా తెలిపారు. నిమిష ప్రియ ఉరిశిక్ష జూలై 16, 2025న అమలు కావాల్సి ఉండగా, దానిని తాత్కాలికంగా వాయిదా వేయించడంలో కేఏ పాల్ తన పాత్ర ఉందన్నారు. తాను టర్కీలోని ఇస్తాంబుల్ నుండి విడుదల చేసిన వీడియోలో, తన ప్రయత్నాలు ఫలించాయని, ఉరిశిక్షను వాయిదా వేయించానని ఆయన ప్రకటించారు.