దేశ వ్యాప్తంగా అత్యాచార ఘటనలు పెరిగిపోయాయి. చిన్నారులు, యువతులు, మహిళలపై లైంగిక దాడులు చేస్తూ కొందరు కామాంధులు పెట్రేగిపోతున్నారు. ఆఖరికి పండు ముసలివాళ్లను సైతం విడిచి పెట్డడం లేదు. వద్దు వద్దు అని వేడుకున్నా కనికరించడం లేదు. ఇంట్లో ఉంటే అన్నదమ్ముల వేధింపులు.. బయటకు వెళితే ఆగంతకుల వేధింపులు.. కనీసం పాఠశాలలో అయినా క్షేమంగా ఉంటారా? అని అనుకుంటే అక్కడ కూడా వేధింపులే.
ఇది కూడా చూడండి: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం
ఇలా ఎక్కడికి వెళ్లినా మహిళలకు కామాంధుల నుంచి రక్షణ లేకుండా పోయింది. దీనిపై పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా ఆగడం లేదు. సభ్యసమాజం తల దించుకునేలా ప్రవర్తిస్తున్నారు. అయితే ఇలా ప్రవర్తించే ఓ ట్యూషన్ మాస్టర్‌కు 111 ఏళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. అవును మీరు విన్నది నిజమే.
111 ఏళ్ల జైలు శిక్ష
ఓ అత్యాచార కేసులో కేరళలోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన ట్యూషన్ ఉపాధ్యాయునికి 111 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఇది మాత్రమే కాకుండా రూ.1.05 లక్షల భారీ జరిమానా విధించింది. ఇక జరిమాన చెల్లించని ఎడల మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.
ఇది కూడా చూడండి: కొత్త ఏడాదిలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఆ రాశుల లిస్ట్ ఇదే!
కేసు ఏంటి?
కేరళకు చెందిన 44 ఏళ్ల మనోజ్ ఒక ప్రభుత్వ ఉద్యోగి. అతడు ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరోవైపు తన ఇంటి వద్ద స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్‌కు ట్యూషన్ చెబుతుండేవాడు. అయితే అందులో ట్యూషన్‌కు వచ్చే ఇంటర్ విద్యార్థినిపై కన్నేశాడు. ఓ రోజు ఆ స్టూడెంట్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా ఫొటోలు, వీడియోలు తీసి ఇతరులకు పంపించాడు.
ఇది కూడా చూడండి: కొత్త సంవత్సర వేళ..పేరు మార్చుకున్న మస్క్..ఎంత వింతగా ఉందో చూడండి!
దీంతో ఈ విషయం తెలిసి ఆ విద్యార్థిని తీవ్ర భయాందోళనకు గురైంది. దీంతో ట్యూషన్‌కు వెళ్లడం మానేసింది. ఇక ఇంట్లో వాళ్లు ప్రశ్నించడంతో జరిగిన విషయం మొత్తం చెప్పింది. వెంటనే ఆ విద్యార్థిని తల్లిదండ్రులు పోలీస్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. అనంతరం పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు.
ఇది కూడా చూడండి: మద్యం దుకాణదారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్
ఆపై నిందితుడి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఇక ఫోరెన్సిక్ పరీక్షలో ఫొటోలు తీసినట్లు కన్ఫార్మ్ అయింది. అయితే ఈ ఘటన జరిగిన రోజు తాను ఆఫీసులనే ఉన్నానంటూ ఆ నిందితుడు బుకాయించే ప్రయత్నం చేశాడు.. కానీ ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆ నిందితుడు తన ఇంటి సమీపంలోనే ఉన్నట్లు వెల్లడైంది. 2019లో చోటుచేసుకున్న ఈ కేసుపై స్పెషల్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విచారణ జరిపింది. అనంతరం నిందితుడికి 111 ఏళ్ల కఠిన శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.