Salaries : సర్కార్ సంచలన నిర్ణయం.. పెరగనున్న MLA, MLCల జీతాలు

కర్ణాటకలో MLA, MLC జీతాలను పెంచుతూ ఆ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. ప్రభుత్వం CMతోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు 100 శాతం పెంపుకు ప్రతిపాదించింది. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఈ ప్రతిపాదన చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

New Update
Ks

Karnataka Assembly

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గుడ్‌న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రితోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు 100 శాతం పెంపుకు ప్రతిపాదించింది ప్రభుత్వం. కర్ణాటక మంత్రుల జీతాలు, భత్యాలు (సవరణ) బిల్లు 2025, కర్ణాటక శాసనసభ సభ్యుల జీతాలు, పెన్షన్లు, భత్యాలు (సవరణ) బిల్లు 2025ను అసెంబ్లీ ఆమోదించింది.  అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్ జీతాలను 67 శాతం పెంచాలని కూడా బిల్లు ప్రతిపాదిస్తోంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పెరుగుతున్న ఖర్చులు, శాసనసభ్యులు మనుగడ సాగించాల్సిన అవసరం కారణంగా ఈ ప్రతిపాదన చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

Also read: Meerut murder mystery: భర్తను చంపి భార్య ముక్కలు చేస్తే.. ఆమె ప్రియుడు తల, చేతులు తీసుకెళ్లి చేతబడి

ముఖ్యమంత్రి జీతం నెలకు రూ. 1,50,000, మంత్రి జీతం నెలకు రూ. 1,25,000, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతం నెలకు రూ.40,000 నుంచి రూ.80,000 వరకు పెరగవచ్చు. పెన్షన్లలో కూడా భారీ పెరుగుదల ఉండే ఛాన్స్ ఉంది. నెలకు రూ. 55,000 నుంచి రూ. 95,000 వరకు పెరగొచ్చు. ప్రయాణ భత్యాలు.. విమాన, రైలు టిక్కెట్లకు గతంలో నెలకు రూ. 2,50,000 నుంచి నెలకు రూ. 3,50,000 పెరగొచ్చు. వైద్య భత్యాలు, టెలిఫోన్ ఛార్జీలు, పోస్టల్ ఛార్జీలు నెలకు రూ.85,000 నుంచి రూ.1,10,000 కు పెరగొచ్చు. అదే సమయంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ల దృష్ట్యా జీతాల పెంపుపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: దెయ్యాలతో చెడుగుడు ఆడేస్తాం.. ఎనీ డౌట్స్..?

Advertisment