KA Paul: నిమిష ఉరిశిక్షను నేనే ఆపా.. కేఏ పాల్ సంచలనం

కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో ఉరిశిక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే. ఉరిశిక్ష పడకుండా తానే ఆపానని ప్రజాశాంతి అధినేత కేఏ పాల్ అన్నారు. నిమిషను కాపడటంలో 8 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు.

New Update

కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్‌లో ఉరిశిక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆమెను రక్షించేందుకు భారత ప్రభుత్వం.. యెమెన్‌తో సంప్రదింపులు జరుపుతోంది. అయితే తాజాగా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమిష ప్రియకు ఉరిశిక్ష పడకుండా తానే ఆపానని అన్నారు. నిమిషను కాపడటంలో 8 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ''యెమెన్ లీడర్లను నేను కలిశాను. దేవుడికి ప్రార్థనలు చేయడంతోనే ఉరిశిక్ష ఆగింది. శాశ్వతంగా మరణశిక్ష నిలిపివేయాలని ప్రయత్నిస్తున్నాను. అందరి ప్రార్థనలతో ఆమె క్షేమంగా తిరిగి వస్తుంది.      

Also Read: విదేశాల్లో బతకడం అంత ఈజీ కాదు, కాస్త ఆలోచించండి.. భారతీయ టెకీ పోస్ట్ వైరల్

ఆమెకు ఉరిశిక్ష పడకుండా బాధిత కుటుంబానికి మిలియన్ డాలర్లు ఇస్తామని నిమిష కుటుంబం బ్లడ్‌మనీ ద్వారా ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ బాధిత కుటుంబం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఈ డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా లేదా తనను ఇవ్వమంటారా అని పాల్ ప్రశ్నించారు. వారం రోజుల్లోగా ఆ డబ్బులు ఇవ్వాలన్నారు. ఉరిశిక్ష వాయిదా పడిందని.. మళ్లీ తాను యెమెన్‌ లీడర్లను కలుస్తానని'' కేఏ పాల్ తెలిపారు. 

Also Read: అమెరికాను ముంచెత్తిన భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల ప్రజలకు ఎమర్జెన్సీ

Advertisment
Advertisment
తాజా కథనాలు