/rtv/media/media_files/2025/05/19/L0BfUd1yDzRhzEFPEiqN.jpg)
పాకిస్తాన్ కు రహస్య సమాచారం చేరవేసిందన్న అభియోగాలతో అరెస్టైన హరియాణా యూట్యూబర్ జ్యోతీ మల్హోత్రాకు బిగ్ షాక్ తగిలింది. ఆమె ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ సస్పెండైంది. అయితే ఇది ప్రభుత్వం చేయించిందా, లేదా నెటిజన్ల ఫిర్యాదులతో బ్లాక్ అయిందా అనేది తెలియాల్సి ఉంది. జ్యోతీ మల్హోత్రా అరెస్టు తర్వాత ఆమెకు 7వేల ఫాలోవర్లు పెరగడం గమనార్హం. 24గంటల్లో సుమారు లక్షమంది ఆమె గురించి గూగుల్లో సెర్చ్ చేయడం విశేషం. మల్హోత్రా ట్రావెల్ విత్ JO అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు -- 3.77 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
🚨 🚨 #BreakingNews Arrested YouTuber Jyoti Malhotra's Instagram account suspended over alleged Pak link https://t.co/pJaxr6Liqs
— Instant News ™ (@InstaBharat) May 19, 2025
Arrested YouTuber Jyoti Malhotras Instagram account suspended over alleged Pak link#TrendingNews #BigBreaking
పలుమార్లు పాక్ కు వెళ్లి
కాగా ఆమెతో పాటు మరికొందరు ఇన్ఫ్లుయెన్సర్లకు పాక్ తో సంబంధాలున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి కీలక విషయాలు బయటికొస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి 3 నెలల ముందు అక్కడికి వెళ్లిన జ్యోతి వీడియో తీసి ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ISIతో సంబంధాలున్న పాక్ ఉద్యోగి డానిష్ తో ఆమె సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జ్యోతీ మల్హోత్రా పాక్ కు పలుమార్లు వెళ్లి వచ్చినట్లు తేలింది. ఉగ్రదాడిలో ఆమె హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : అగ్ని ప్రమాద బాధితులకు రూ.25 లక్షల పరిహారం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు