Covid New Variant: కరోనా కొత్త వేరియంట్ JN.1 నిజంగా డేంజరా?.. మన దేశంలో మళ్లీ లాక్ డౌన్ తప్పదా?

భారత్‌లో కోవిడ్ కొత్త వేరియంట్ JN.1 విజృంభిస్తోంది. ప్రస్తుతం 257 యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు గరిష్ట కేసులను గుర్తించారు. సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్‌లో ఈ కేసులు భారీగా నమోదవుతున్నాయి. JN.1 వేరియంట్ గురించ WHO ఏమందంటే..

New Update
Covid new variant JN.1

ప్రపంచ దేశాలన్నీటిని 2020లో ఓ మహమ్మరి కబలించింది. అందరూ ఇళ్లే పరిమితమయ్యారు. గాలి సోకి వేలల్లో మరణాలు సంభవించాయి. దాని పేరు వింటే లాక్‌డౌన్ రోజులు గుర్తుకువస్తాయి. అలాంటి రోజులు మల్లీ రాబోతున్నాయా? గత కొన్ని వారాలుగా ఆసియా అంతటా కోవిడ్-19 కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆసియాలోని రెండు అతిపెద్ద నగరాలైన హాంకాంగ్, సింగపూర్‌లలో భారీగా పాజిటివ్ కేసులు వెలుగుచూస్తు్న్నాయి. సింగపూర్‌లో ఈవారంలో 28శాతం కేసులు పెరిగాయి. హాంకాంగ్‌లో కోవిడ్ బారిన పడి 31 మంది మరణించారు. మే ప్రారంభంలో సింగపూర్ 14,000 కంటే ఎక్కువ కేసులను నమోదు అయ్యాయి. హాంకాంగ్, థాయిలాండ్‌లలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితులే. హాంకాంగ్‌లోని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ ప్రకారం ప్రస్తుతం వ్యాపిస్తున్న వైరస్ చాలా యాక్టీవ్‌గా ఉందని తెలిపింది. హాంకాంగ్, సింగపూర్, చైనా, థాయిలాండ్‌లోని ఆరోగ్య అధికారులు కొత్త బూస్టర్ టీకాలు తీసుకోవాలని ప్రజలను కోరారు. ప్రజల్లో రోగనిరోధక శక్తి తగ్గడం వల్లే కేసులు పెరగవచ్చుని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

భారతదేశంలో కొత్త కేసులు

సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్ ప్రాంతాల నుంచి ఇండియాకు రావడంతో ఇక్కడ కూడా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కూడా యాక్టివ్ కేసులు పెరిగాయి. ఒక వారంలో 12 నుండి 56 కి పెరిగాయి. ప్రస్తుతం భారతదేశంలో 257 యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నాయి, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు గరిష్ట కేసులను గుర్తించారు. హెల్త్ మినిస్టరీ సిచువేషన్‌ని క్లోస్‌గా పరిశీలిస్తున్నారు. అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం కేసులు చాలావరకు తేలికపాటివి, అసాధారణ తీవ్రత లేదా మరణాలతో సంబంధం కలిగి లేవని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. 

కొత్త వేరియంట్ ఉందా?

ఆసియా అంతటా కోవిడ్-19 కేసుల పెరుగుదలకు ఓమిక్రాన్ కుటుంబానికి చెందిన JN.1 వేరియంట్, దాని సంబంధిత వారసులు కారణమని భావిస్తున్నారు. సింగపూర్ ఆరోగ్య అధికారుల ప్రకారం, JN.1 వేరియంట్ వారసులైన LF.7, NB.1.8 అనే కొత్త వేరియంట్‌లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి.

JN.1 గురించి WHO

JN.1 జాతి BA.2.86 వేరియంట్ (ఓమిక్రాన్ సబ్ వేరియంట్). ప్రపంచ ఆరోగ్య సంస్థ JN.1 జాతిని ఆసక్తికరమైన వేరియంట్‌గా వర్గీకరించింది. ఆందోళన కలిగించే వేరియంట్ కాదు. JN.1 వల్ల కలిగే ప్రపంచ ప్రజారోగ్య ప్రమాదం తక్కువగా ఉందని WHO పేర్కొంది.

JN.1 వేరియంట్ లక్షణాలు

ఈ వేరియంట్ కోవిడ్ సోకిన వ్యక్తులు తేలికపాటి శ్వాసకోశ లక్షణాలను అనుభవిస్తారు. కొన్ని సాధారణ లక్షణాలలో జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి, తలనొప్పి, విపరీతమైన అలసట, కండరాల బలహీనత, అలసట, చిన్న జీర్ణశయాంతర సమస్యలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో, కొత్త వేరియంట్ ఆకలి లేకపోవడం, నిరంతర వికారంతో కూడా ఉండవచ్చు. ఈ లక్షణాలు సాధారణంగా తేలికపాటివి. సాధారణంగా నాలుగు నుంచి ఐదు రోజుల్లో కోలుకోవచ్చు.

(covid | Covid-19 Cases | covid-cases | corona-new-variant | latest-telugu-news | Covid New Variant)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు