జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఇటీవల ఈవీలంపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఖండించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్సీ పార్టీ.. త్వరలో ఎన్డీయేలో చేరబోతుందనే వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎన్సీ పార్టీ తాజాగా స్పందించింది. ఇవి నిరాధారమైన ఆరోపణలంటూ కొట్టిపారేసింది. ప్రజలకు తప్పుదోవ పట్టించేలా చేసిన ఈ వాదనలు అబద్ధమని తేల్చిచెప్పింది. ఇది కూడా చదవండి: Pawan kalyan: ఏపీకి రండి.. సినీ పెద్దలకు పవన్ కళ్యాణ్ పిలుపు! ఇక వివరాల్లోకి వెళ్తే.. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించేందుకు ఎన్డీయేలోకి ఎన్సీ పార్టీ వెళ్లేందుకు సిద్ధమవుతోందని ఓ మీడియాలో కథనం వచ్చింది. దీనిపై నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్రధాన ప్రతినిధి తన్వీర్ సాదిక్ స్పందించారు. '' ఇలాటి ఆధారం లేని వదంతులు వ్యాప్తిచేయడం సరికాదు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బీజేపీ అగ్రనాయకత్వం నేతలతో కలిసినట్లు చెబుతున్నారు. వాళ్ల పేర్లను బయటపెట్టండి. లేకపోతే క్షమాపణలు చెప్పి.. ఆ కల్పిత కథనాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని'' తన్వీర్ తెలిపారు. Also Read: రెండు రికార్డులు సృష్టించిన పక్షి.. 74 ఏళ్ల వయసులో ఇదేం విచిత్రం! ఇదిలాఉండగా.. ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం ఒమర్ అబ్దుల్లా సమావేశమయ్యారు. జమ్మూకశ్మీర్‌కు వెంటనే రాష్ట్రహోదా పునరుద్ధరించడంతో పాటు స్థానికంగా ఉగ్రవాదాన్ని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేయడం వంటి వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఇటీవల ఈవీలంపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఒమర్ అబ్దుల్లా ఖండించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్సీ పార్టీ.. బీజేపీలోకి చేరబోతుందనే ప్రచారం జరిగింది. చివరికి ఈ ఆరోపణలను ఎన్సీ పార్టీ కొట్టిపారేసింది. Also Read: బాల్య వివాహాలపై అస్సాం కఠిన చర్య.. మరో 416 మంది అరెస్టు Also Read: సైబర్ నేరాల్లో రూ.297 కోట్లు పోగొట్టుకున్న బాధితులు: సీవీ ఆనంద్